హీరోల మూడో తరం వారసులు తెరంగేర్ర చేయడానికి రెడీగా వున్నవాళ్ళలో అక్కినేని అఖిల్ ముందున్నాడు. పుడుతూనే ఊహ తెలియని వయస్సులో ‘సిసింద్రీ’ సినిమాలో నటించిన అఖిల్ తన తాతగారి కోరిక మేరకు ‘మనం’ సినిమాలో తన ట్రెయిలర్ చూపించాడు.
ఇప్పుడు అఖిల్‌ని గ్రాండ్‌గా ప్రెజెంట్ చెయ్యడానికి శీఘ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ కథ ఓకే అయ్యిందనీ, దానికి ‘ఢమరుకం’ ఫేం రచయిత వెలిగిగొండ శ్రీనివాస్ కథ అందించినట్లు, ఆ రచయిత తన ఫేస్ బుక్‌లో అప్పుడే పబ్లిసిటీ ప్రారంభించేశాడు. నిజానికి అఖిల్ లాంటి క్యూట్ హీరోని సుమోలు గాల్లో లేపేసే నాటు సినిమాలు తీసే డైరెక్టర్ వినాయక్ చేతిలో పెట్టడం ఎంతవరకూ సేఫ్టీ.. అనే చర్చ జరుగుతోంది.
మొన్ననే బెల్లంకొండ తనయుడి సినిమా ‘అల్లుడు శీను’ అటు ఇటు అయ్యింది. కొత్త హీరోలు వి.వి. వినాయక్ లెవెల్ సినిమాలను మోయగలరా.? సుకుమారంగా తెరకు పరిచయం అవుతున్న అఖిల్ గాల్లో సుమోలనూ, జీప్లనూ పేల్చేస్తే ఆ హెవీనెస్ని అఖిల్ పండించగలడా.? పోనీ క్యూట్‌గా లవ్ స్టోరీని హ్యాండిల్ చెయ్యగలడా.. అంటే అది వినాయక్‌కి అంతగా పరిచయంలేని విషయం. ఇప్పటికే నాగచైతన్యని యాక్షన్ ఇమేజ్‌లో ఇరికించి అటూ ఇటూ కాకుండా చేశారు. అలాంటి పొరపాటు అఖిల్ విషయంలో జరగదని ఆశిద్దాం.