అంతా అయిపోయాక సంత అని, అవకాశాలు అన్నీ పోయాక, చేతిలో సినిమాలు లేని పరిస్థితి వచ్చాక, చార్మీ తీరికూర్చుని వెబ్ సైట్ డిజైన్ చేయించుకుంది. http://charmmekaur.com/ అనే పేరుతో తన స్వంత వెబ్ సైట్ శనివారం నుంచి ప్రారంభించింది. తన పోటోలు, ఆశలు ,ఆకాంక్షలు అన్నీ అందులో వుంచింది.
మిగతా వ్యవహారాలు ఎలా వున్నా సైట్ మాత్రం చూడ్డానికి క్లాసీగా, సూపర్ గా వుంది. నాజూకైన చార్మీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు అదిరాయి. చిత్రమేమిటంటే, అందులో పనిలో పనిగా తన గురించి ఓ మాట చెప్పింది. తన హైట్ దాదాపు అందరు హీరోలకు సరిపోతుందని, మరీ అవసరమైతే హీల్స్ వుండనే వున్నాయని ముక్తాయించింది.
అయినా చార్మి ఒడ్డు, పొడవు, ఇప్పుడు కొత్తగా టాలీవుడ్ జనాలకు పరిచయం చేసుకోవాలా? ఈ వెబ్ సైట్ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. చార్మి ఫీల్డ్ కు వచ్చి అప్పుడే పన్నెండేళ్లు గడచాయి. యాభై సినిమాలు చేసేసింది. అంటే పోనీ పద్దెనిమిది ఏళ్లకు ఫీల్డుకు వచ్చిందనుకున్నా ఇప్పుడు ముఫైకి చేరుకున్నట్లేనా..అంటే చార్మీ ఆంటీ ఇప్పుడు థర్టీ ప్లస్ అన్నమాట.