సూపర్ స్టార్ మహేష్ తో భారీ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ రూపొందించే సినిమాకు నిర్మాతగా డివివి దానయ్య వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం అయినట్లు బోగట్టా.
ఈ సినిమాకు సంబంధించి లైన్, బడ్జెట్ వగైరాలు అన్నీ పూర్తయ్యాయట. ఎనభై కోట్ల వరకు ఖర్చయ్యే సినిమా అని వినికిడి.అయితే వంద కోట్లయినా ఫరవాలేదు, సూపర్ సినిమాగా వుండాల్సిందే అని నిర్మాత దానయ్య ధైర్యం చేస్తున్నారట.
మరి ఈ సినిమా బ్రహ్మోత్సవం తరువాత వుంటుందా, లేదా త్రివిక్రమ్ సినిమా చేసాక వుంటుందా అన్నది ఇంకా తేలాలి. కానీ బ్రహ్మోత్సవం తరువాతే వుండడానికి అవకాశం వుందంటున్నారు. ఎందుకంటే అప్పటికి నిర్మాత దానయ్య, దర్శకుడు వినాయక్ కూడా తమ తమ కమిట్ మెంట్ లు పూర్తి చేసుకుని రెడీగా వుంటారు.