సర్దార్ హడావుడి అందుకేనా?

గబ్బర్ సింగ్ 2 అలియాస్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇలా షూటింగ్ ప్రారంభిస్తూనే ఓ డిజైన్..అలా వారం తిరక్కుండానే ఓ ఫస్ట్ లుక్. సినిమా రెండు మూడేళ్లుగా వార్తల్లోనే నలుగుతోంది. ఇద్దరు డైరక్టర్లు అయ్యారు.…

గబ్బర్ సింగ్ 2 అలియాస్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇలా షూటింగ్ ప్రారంభిస్తూనే ఓ డిజైన్..అలా వారం తిరక్కుండానే ఓ ఫస్ట్ లుక్. సినిమా రెండు మూడేళ్లుగా వార్తల్లోనే నలుగుతోంది. ఇద్దరు డైరక్టర్లు అయ్యారు. అసలు సినిమా వస్తుందా రాదా అన్న అనుమానం కలిగింది. అలాంటిది ఇప్పుడు ఎందుకు హడావుడి..? ఎందుకంటే తగిన కారణమే వుందని తెలుస్తోంది. ఈరోస్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కు హోల్ అండ్ సోల్ హక్కు దారు. అయితే దానికి బిజినెస్ ఇక్కడ మళ్లీ వీళ్లే చేయాలి. 

మినమమ్ గ్యారంటీ వుంటుంది. అయితే ఏళ్లకాలంగా షెడ్ లో వున్న సర్ధార్ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. పవన్ కు మూడ్ వస్తే షూటింగ్ లేదంటే లేదు. దీన్ని నమ్మి ముందుగా ఎవరు దిగుతారు బయ్యర్లు? అందుకే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వినికిడి. అందుకే సినిమా చకచకా రెడీ అయిపోతోందన్న ఫీలింగ్ కలిగించడానికి నిర్మాత శరద్ మురార్ ఇలా హడావుడి చేస్తున్నారట. 

సినిమా బిజినెస్ కు ఢోకా వుండదు. కలెక్షన్లకు ఢోకా వుండదు. కానీ సినిమా మొదలెట్టి, అలా అలా నాన్చడంతో ఇప్పుడు అంతా పూర్తయ్యాక చూద్దాంలే అని బయ్యర్లు సైలెంట్ గా వున్నారు. అదే ప్రాబ్లమ్. అందుకే ఈ హడావుడి.