అక్కడ మధుర శ్రీధర్ లక్కీ

మధుర శ్రీధర్ నిర్మాణంలో లేడీస్ అండ్ జెంటిల్ మన్ విడుదలయింది. దాదాపు పాజిటివ్ సమీక్షలు అందుకుంది. అదే ఇప్పుడు ఆయనకు లక్ గా మారింది. ఎందకంటే సినిమా విడుదలకు ముందు ఆ సినిమా శాటిలైట్…

మధుర శ్రీధర్ నిర్మాణంలో లేడీస్ అండ్ జెంటిల్ మన్ విడుదలయింది. దాదాపు పాజిటివ్ సమీక్షలు అందుకుంది. అదే ఇప్పుడు ఆయనకు లక్ గా మారింది. ఎందకంటే సినిమా విడుదలకు ముందు ఆ సినిమా శాటిలైట్ హక్కులు విక్రయించలేదు. తొలిరోజు పాజిటివ్ టాక్ రావడంతో రెండు చానెళ్ల నుంచి ఎంక్వయిరీలు వచ్చాయని వినికిడి. 

సినిమాకు అంతా కలిపి రెండు కోట్ల దాకా అయింది. అందువల్ల వీలయినంత వరకు శాటిలైట్ హక్కులతోనే గట్టెక్కేసే అవకాశం కనిపిస్తోంది. సినిమాను సురేష్, మల్టీ డైమన్షన్ సంస్థల విడుదల చేసాయి. తొలి రోజు టాక్ బాగుంది కానీ ఓపెనింగ్స్ పెద్దగా లేవు. 

ఈ టాక్ తో శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగుండి, సోమవారానికి మౌత్ టాక్ మరింతగా స్ప్రెడ్ అవుతుదందని యూనిట్ వర్గాలు ఆశగా వున్నాయి. ఇదిలా వుంటే ఓవర్ సీస్ లో మాత్రం మరో పది స్క్రీన్ల వరకు జోడించారు రెండవ రోజుకు. సినిమా చివరి అరగంట సరైన దోవలో వెళ్లడం పనికివచ్చింది. అదే ఇప్పుడు యూనిట్ కు ఆశలు చిగురింపచేస్తోంది.