17న విడుదలవుతోంది మంచు మనోజ్ కరెంట్ తీగ. మాంచి ఎక్స్ పెక్టేషన్లు వున్నాయి దీని పైన. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా మాస్ సెంటర్లలో బాగా పే చేస్తుందని అనుకుంటున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది కార్తికేయ. నిఖిల్ స్వాతి ఇందులో జంట. ఈ సినిమాను కూడా 17 లేదా 18 న విడుదల చేయాలనుకుంటున్నారు.
అయితే ఇప్పుడు మనోజ్ ఈ సినిమాను 24న వేసుకో..నువ్వు సోలోగా వచ్చినట్లు వుంటుంది అని చెబుతున్నాడట నిఖిల్ కు. దీంతో నిఖిల్ తన సినిమాను 24కు తీసుకెళ్దామని అనుకుంటున్నాడట. ఇంతకీ 24న నిఖిల్ ను సోలో చేద్దామనా, లేక 17న తన సినిమా సోలో చేసుకుందామనా మనోజ్ ఈ సలహా ఇచ్చింది? అయినా ఈ ఇద్దరు అడ్జెస్ట్ చేసుకుంటే సరిపోద్దా..ఇంకా చిన్నా చితకా చాలా సినిమాలు వున్నాయి కదా?