తారక్ అభిమానులకు ఓకేనా?

నే పనికిమాలిన యెదవ..హే భగవాన్..నే చెయ్యని తప్పు లేదే ఓ భగవాన్. చెయ్యి చేజారిపోయింది..మంట కలిసిపోయింది. ఈ నా జీవితం దేవుడా..ఇంకోసారి ఇవ్వవా..నా జీవితాన్ని..రిప్పేరు..రిప్పేరు కర్లూంగా.. Advertisement ఇదీ టెంపర్ లో ఓ పాట.…

నే పనికిమాలిన యెదవ..హే భగవాన్..నే చెయ్యని తప్పు లేదే ఓ భగవాన్. చెయ్యి చేజారిపోయింది..మంట కలిసిపోయింది. ఈ నా జీవితం దేవుడా..ఇంకోసారి ఇవ్వవా..నా జీవితాన్ని..రిప్పేరు..రిప్పేరు కర్లూంగా..

ఇదీ టెంపర్ లో ఓ పాట. పూరి జగన్నాధ్ సినిమాలో పాట కాబట్టి పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. పూరి సినిమాలకు పక్కా సూటయ్యే రవితేజ లాంటి హీరో అయి వుంటే అస్సలు ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే జనాలకు అలవాటే. కానీ ఎన్టీఆర్ లాంటి హీరోకు ఇలాంటి పాట రాయించడం అంటే కాస్త ఆశ్చర్యమే. 

భయంకరమైన హీరోయిజం, చరిష్మా..నందమూరి వంశం ఇలాంటి అదనపు భుజకీర్తులున్న ఎన్టీఆర్ కు ఇలా నేను పనికిమాలిన యెదవని..చేయని తప్పులు లేవు..జీవితం చేజారిపోయింది..మంట కలిసిపోయింది అని పాట రాయించడం అంటే మరీ ఆశర్యమే. సినిమాలో క్యారెక్టర్ పాట అని సరిపెట్టుకో చూడ్డానికి లేదు. 

ఎందుకంటే వంశాలు, సోత్కర్షలు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎప్పుడూ నందమూరి వారి పాటల్లో, సినిమాల్లొ, మాటల్లో కీలకపాత్ర వహిస్తాయి. మరి ఈ పాటను నందమూరి అభిమానులు జీర్ణించుకోగలరా? అప్పుడే తెలుగదేశం లోకేష్ క్యాంప్ జనాలు సెటైర్లు వేస్తున్నారని వినికిడి. ఎన్టీఆర్ చంద్రబాబు ముందు ఇలా ప్రాధేయపడినట్లు వుందని.