ఆగస్టు 15కు ఎన్టీఆర్ కొత్త స్టిల్

సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో చకచకా రెడీ అవుతోంది భొగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమాకు సంబంధించి, ఎన్టీఆర్ గెటప్ కు సంణంధించి ఇప్పటికే ఓ స్టిల్ బయటకు వచ్చి, ఆసక్తి పెంచింది. Advertisement…

సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో చకచకా రెడీ అవుతోంది భొగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమాకు సంబంధించి, ఎన్టీఆర్ గెటప్ కు సంణంధించి ఇప్పటికే ఓ స్టిల్ బయటకు వచ్చి, ఆసక్తి పెంచింది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించే, మరో మాంచి స్టిల్ ను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారు. 14రాత్రికి దీన్ని విడుదల చేస్తారని వినికిడి. సినిమాకు గ్రాడ్యువల్ గా హైప్ తీసుకురావాలని, ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచాలని ఆలోచించి, ఎన్టీఆర్ ఈ మేరకు ప్లాన్ చేసారని వినికిడి.

ఈ సినిమాకు నాన్నకు ప్రేమతో..అన్న టైటిల్ ఇప్పటికైతే ప్రచారం లో వుంది. మూడువంతులకు పైగా సినిమా యూరప్ లోనే జరుగుతుంది కాబట్టి, ఓ లెంగ్తీ షెడ్యూలు అక్కడ ప్లాన్ చేసారు. అదే ఇఫ్పుడు జరుగుతోంది.