పవన్‌దీ చరణ్‌ రేంజే!

టైటిల్స్‌ మధ్య సారూప్యమే కాదు… ఫైనల్‌ రిజల్ట్‌లోను ‘గోపాల గోపాల’, ‘గోవిందుడు అందరివాడేలే’ మధ్య స్పష్టమైన పోలిక ఉంది. గత దసరాకి రిలీజ్‌ అయిన ‘గోవిందుడు అందరివాడేలే’ యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుని ఫైనల్‌గా నలభై…

టైటిల్స్‌ మధ్య సారూప్యమే కాదు… ఫైనల్‌ రిజల్ట్‌లోను ‘గోపాల గోపాల’, ‘గోవిందుడు అందరివాడేలే’ మధ్య స్పష్టమైన పోలిక ఉంది. గత దసరాకి రిలీజ్‌ అయిన ‘గోవిందుడు అందరివాడేలే’ యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుని ఫైనల్‌గా నలభై రెండు కోట్ల షేర్‌తో సరిపెట్టింది. బయ్యర్లందరూ సేఫ్‌ కాకపోవడంతో, కమర్షియల్‌గా యావరేజ్‌ రిజల్ట్‌ తెచ్చుకుంది. 

‘గోపాల గోపాల’ కూడా ఇంచుమించు అదే ఫలితాన్ని సాధించింది. ‘గోవిందుడు’కి దసరా సెలవులు కలిసొస్తే.. ‘గోపాల గోపాల’కి సంక్రాంతి సీజన్‌ హెల్ప్‌ అయింది. ఈ చిత్రంపై కూడా బయ్యర్లు కాస్త నష్టపోయారు. ‘గోవిందుడు అందరివాడేలే’ ఫ్యామిలీ జోనర్‌ సినిమా కాగా, ‘గోపాల గోపాల’ పూర్తిగా ప్రయోగాత్మక చిత్రం. 

ఈ రెండిటినీ జోనర్స్‌ పరంగా కంపేర్‌ చేయడం సబబు కాదు కానీ… సినిమాకి వచ్చిన టాక్‌, ఫైనల్‌ రిజల్ట్‌ అయితే అచ్చంగా ఒకేలా ఉంది. గోవిందుడుకి జోనర్‌ పరంగా అడ్వాంటేజ్‌ ఉంటే, గోపాల గోపాలకి మల్టీస్టారర్‌ అనే ఎడ్జ్‌ ఉంది. ఏదేమైనా నలభై కోట్ల మార్కు దాటినా కానీ ఈ చిత్రాలు బయ్యర్లని పూర్తిగా గట్టున వేయలేకపోయాయి.