దాసరి మళ్లీ మరోసారి

గంట కొట్టే టైమ్ అవగానే పిట్ట బయటకు వచ్చి, కుకు..కుకు అనేసి, మళ్లీ లోపలికి వెళ్లిపోయే గడియారాలు కొన్ని వున్నాయి. దర్శకుడు దాసరి వ్యవహారం ఇలాగే వుంటుంది. పుట్టిన రోజు దగ్గరకు రాగానే సామూహిక…

గంట కొట్టే టైమ్ అవగానే పిట్ట బయటకు వచ్చి, కుకు..కుకు అనేసి, మళ్లీ లోపలికి వెళ్లిపోయే గడియారాలు కొన్ని వున్నాయి. దర్శకుడు దాసరి వ్యవహారం ఇలాగే వుంటుంది. పుట్టిన రోజు దగ్గరకు రాగానే సామూహిక బంతి భోజనాల్లా, మీడియా పేరంటాలు పెట్టడం, కొత్త నిర్ణయాల ప్రకటించడం మామూలే. మళ్లీ పుట్టిన రోజు వరకు వాటి ఊసే వుండదు. 

బాలయ్యతో పరమ వీర…సినిమా తీసేసాక మళ్లీ సినిమా లేదు. వడ్డికాసులవాడు అంటూ ముఖ్యమంత్రి సహాయకుడి పాత్రతో సినిమా తీస్తా అని గత ఏడాది అనేసరికి అబ్బో,..ఏదో సంచలనం అనుకున్నారంతా. తీరా చేసి మళ్లీ పుట్టిన రోజు వచ్చింది కానీ, దాని అతీ గతీ లేదు. 

చేపా చేపా ఎందుకు ఎండలేదంటే అన్న చందంగా, రాష్ట్ర విభజన అడ్డు వచ్చిందని చెబుతున్నారట ఇప్పుడు. సరే ఆ సంగతి వదిలేస్తే, మళ్లీ మరో నాలుగైదు రోజుల్లో పుట్టిన రోజు వస్తోంది. అందుకే దాసరి మాటలు సవరించుకుంటున్నారు. మళ్లీ సినిమాల వరస ప్రకటిస్తారంట.