డిజాస్టర్‌ టాక్‌తో 100 కోట్లు!

కరెక్ట్‌ ప్యాకేజింగ్‌తో, సరిగ్గా మార్కెట్‌ చేస్తే.. డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా కానీ ఓపెనింగ్స్‌ ఢోకా ఉండదని హిందీ చిత్రాలు చాలానే రుజువు చేసాయి. అదే పద్ధతిని శంకర్‌ ఫాలో అయిపోయాడు. తను తీసిన ‘ఐ’లాంటి…

కరెక్ట్‌ ప్యాకేజింగ్‌తో, సరిగ్గా మార్కెట్‌ చేస్తే.. డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా కానీ ఓపెనింగ్స్‌ ఢోకా ఉండదని హిందీ చిత్రాలు చాలానే రుజువు చేసాయి. అదే పద్ధతిని శంకర్‌ ఫాలో అయిపోయాడు. తను తీసిన ‘ఐ’లాంటి బ్యాడ్‌ మూవీతోనే వంద కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించేసాడు. మూడు భాషల్లో కలిపి ఐ అయిదు రోజుల్లో వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించినట్టు ట్రేడ్‌ రిపోర్ట్‌. 

తెలుగులో డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా కానీ సంక్రాంతి సీజన్‌ అడ్వాంటేజ్‌ని ఐ శుభ్రంగా క్యాష్‌ చేసుకుంది. అలా అని ఇంకా సేఫ్‌ జోన్‌కి అయితే చేరుకోలేదు. తెలుగుతో కంపేర్‌ చేస్తే తమిళంలో ఐకి డీసెంట్‌ టాక్‌ ఉంది. హిందీ వెర్షన్‌ని అక్కడి జనం అంతగా పట్టించుకోవడం లేదు. ఐ కేరళలో మాత్రం బాగా ఫేర్‌ చేస్తోంది. 

వంద కోట్ల గ్రాస్‌ వసూళ్లని అయిదే రోజుల్లో తెచ్చుకున్న ఐ ఇక అసలు పరీక్షకి సిద్ధమవుతోంది. ఇక ప్యాకేజింగ్‌తో, గిమ్మిక్కులతో కలెక్షన్స్‌ రావు కాబట్టి పూర్తిగా ప్రేక్షకాదరణ మీదే డిపెండ్‌ అవుతుంది. వంద కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినప్పటికీ రజనీకాంత్‌ లింగ డిజాస్టర్‌ అయింది. అలాంటి పరిస్థితి ఐకి రాకూడదంటే… కలెక్షన్స్‌ పడిపోకుండా స్టడీగా ఉండాలి.