చ‌ర‌ణ్‌కి పాత టైటిలే ద‌క్కింది

నీ ముక్కేదంటే… చుట్టూ తిరిగి మ‌ళ్లీ ముక్కు ద‌గ్గర‌కే వ‌చ్చిన‌ట్టుంది రామ్‌చ‌ర‌ణ్ టైటిల్ వ్యవ‌హారం. రామ్‌చ‌ర‌ణ్ – కృష్ణవంశీ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి గోవిందుడు అంద‌రి వాడేలే అనే టైటిల్…

నీ ముక్కేదంటే… చుట్టూ తిరిగి మ‌ళ్లీ ముక్కు ద‌గ్గర‌కే వ‌చ్చిన‌ట్టుంది రామ్‌చ‌ర‌ణ్ టైటిల్ వ్యవ‌హారం. రామ్‌చ‌ర‌ణ్ – కృష్ణవంశీ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి గోవిందుడు అంద‌రి వాడేలే అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు రెండు నెల‌ల క్రిత‌మే వార్తలొచ్చాయి. అయితే వాటిని చిత్రబృందం ఖండించింది. మా చిత్రానికి ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదు.. అని బండ్ల గ‌ణేష్ ఓ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేశారు. 

ఆ త‌ర‌వాత ఓ అర‌డ‌జ‌ను టైటిళ్లు చ‌క్కర్లు కొట్టాయి. చివ‌రికి మ‌ళ్లీ గోవిందుడు అంద‌రివాడేలే.. అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తిరిగి తిరిగి మ‌ళ్లీ ఆ పాత టైటిల్ ద‌గ్గర‌కే వ‌చ్చార‌న్నమాట‌. ఈ టైటిల్ కొంత‌మంది మెగా అభిమానుల‌కు న‌చ్చలేదు.  ఎన్టీఆర్ బృందావ‌నం టైటిల్ కి ఇది ఉప‌శీర్షిక. 

అందుకే ఈ టైటిల్ ప‌ట్ల ఫ్యాన్స్ అభ్యంత‌రం తెలిపారు. మ‌రో టైటిల్ వెదికినా… కృష్ణవంశీకి న‌చ్చడం లేదు. అందుకే తిరిగి మ‌ళ్లీ పాత టైటిలే ఫిక్స్ చేశారు. పొలాచ్చీ, రామేశ్వరంల‌లో కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రించారు. ఒక షెడ్యూల్ పూర్తయింది. త్వర‌లోనే హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తారు.