నాని అంత రిస్క్ చేస్తాడా?!

వ‌రుస‌గా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుండ‌టంతో నాని వాటి ప్రమోష‌న్‌పైనే దృష్టి పెట్టాడు. కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. అయితే త‌దుప‌రి ఆయ‌న చేయ‌నున్న సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్రచారం సాగుతోంది.  Advertisement తేజ…

వ‌రుస‌గా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుండ‌టంతో నాని వాటి ప్రమోష‌న్‌పైనే దృష్టి పెట్టాడు. కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. అయితే త‌దుప‌రి ఆయ‌న చేయ‌నున్న సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్రచారం సాగుతోంది. 

తేజ ద‌ర్శక‌త్వంలో `సావిత్రి` అనే సినిమా చేయ‌బోతున్నాడ‌నీ, ఇప్పటికే నాని ఆ క‌థని విన్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. `సావిత్రి` అనే క‌థ‌ని తేజ… ఇదివ‌ర‌కు  వెంక‌టేష్‌తో తీయ‌బోతున్నాడ‌ని ప్రచారం సాగింది. 

ఇప్పుడు మాత్రం ఆ క‌థ నాని చేతికొచ్చిందంటున్నారు. ఇప్పటికే `పైసా`, `ఆహా క‌ళ్యాణం`లాంటి సినిమాలు చేసి త‌ప్పు చేశానా అనే ఆలోచన‌లో ప‌డిపోయాడు నాని. మ‌రి ఈమ‌ధ్య హిట్లే లేని ఆయ‌న తేజ ద‌ర్శక‌త్వంలో న‌టించేంత రిస్క్ చేస్తాడా అనేది ప్రశ్న‌. అన్నట్టు తేజ కూడా `త‌ప్పు` అనే మ‌రో చిత్రంపై దృష్టిపెట్టాడు.