స‌మంతని భ‌య‌పెడుతోందా?

అందాల మంత్రం వేసి ఇట్టే మాయ చేసేస్తుంది స‌మంత‌. తెర‌పై క‌నిపించిందంటే చాలు… ప్రేక్షకుడి క‌ళ్లన్నీ ఆమెపైనే. క‌థానాయకుల్ని సైతం డామినేట్ చేస్తుంద‌నే పేరు సంపాదించింది. అలాంటి స‌మంత‌ని ఇటీవ‌ల ఓ ముద్దుగుమ్మ భ‌య‌పెడుతోంద‌ట‌.…

అందాల మంత్రం వేసి ఇట్టే మాయ చేసేస్తుంది స‌మంత‌. తెర‌పై క‌నిపించిందంటే చాలు… ప్రేక్షకుడి క‌ళ్లన్నీ ఆమెపైనే. క‌థానాయకుల్ని సైతం డామినేట్ చేస్తుంద‌నే పేరు సంపాదించింది. అలాంటి స‌మంత‌ని ఇటీవ‌ల ఓ ముద్దుగుమ్మ భ‌య‌పెడుతోంద‌ట‌. ఆమె ఎవ‌రో కాదు… అమ్మో బాపుగారి బొమ్మో అంటూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పొగిడించుకొన్న ప్రణీత‌. 

అవును… స‌మంత‌కి ప్రణీత భ‌యం ప‌ట్టుకొంద‌ట‌. `అత్తారింటికి దారేది` సినిమాలో స‌మంత‌ని మించిపోయేలా క‌నిపించింది ప్రణీత‌. అంద‌రూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా చూశారు కానీ…  క‌థానాయిక‌ల్ని తూకం వేసి చూసుంటే మాత్రం స‌మంత‌కి మైన‌స్ మార్కులొచ్చేవ‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పుడు `ర‌భ‌స‌`లోనూ స‌మంత‌, ప్రణీత క‌లిసి న‌టిస్తున్నారు. 

ఇందులోనూ ప్రణీత కీల‌క‌మైన పాత్రనే పోషించింద‌ట‌. అందంలోనూ `అత్తారింటికి దారేది`లోకంటే మ‌రింత బాగా క‌నిపించింద‌ట‌. ఆమె ర‌షెస్‌ని చూసిన స‌మంత‌కి గుండెలు గుభేల్‌మ‌న్నాయని ఇన్‌సైడ్ టాక్‌. ఇక నుంచి మాత్రం ప్రణీత‌తో క‌లిసి న‌టించ‌కూడ‌ద‌ని స‌మంత డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. తెర‌పై బాపు బొమ్మలా క‌నిపిస్తున్నా… ప్రణీత‌కి మాత్రం చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు దొర‌క‌డం లేదెందుకో?!