పవన్‌కళ్యాణ్ మాంఛి జోరు మీద ఉండగా… తన కెరీర్‌కి అవసరం లేని బ్రేకులు వేసుకున్నాడిప్పుడు. ఈపాటికి మొదలు కావాల్సిన గబ్బర్‌సింగ్ 2 ఇంతవరకు మొదలే కాలేదు. అసలు ఎప్పుడు అవుతుందనేది కూడా తెలీడం లేదు. ఈ ఏడాదిలో అయితే పవన్ సినిమా ఏదీ ఉండదు.
గబ్బర్‌సింగ్ 2 ఏప్రిల్‌లో స్టార్ట్ కావచ్చునని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ చిత్రానికి కథ ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదని, పవన్ దేంతోను సంతృప్తి చెందడం లేదని, అందుకే ఇది మొదలు కాలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ చిత్రం కాన్సిల్ అనుకున్నట్టయితే పవన్ చేసే తదుపరి చిత్రం ఏమిటి?
ప్రస్తుతానికి గబ్బర్‌సింగ్ 2 మినహా మరే ప్రాజెక్ట్ గురించి పవన్ డిసైడ్ కాలేదు. కనీసం ఏ దర్శకుడితో అయినా తన తదుపరి చిత్రం చేద్దామని కూడా ఇంతవరకు కనీసం మాట కూడా అనుకోలేదు. అంటే ఒకవేళ గబ్బర్‌సింగ్ 2 ప్రాజెక్ట్‌ని స్క్రాప్ చేసినట్టయితే మాత్రం పవన్ తదుపరి చిత్రం రావడానికి చాలా టైమ్ పడుతుంది.