నోరు జారిన స‌మంత‌

ఏమిటో ఈమ‌ధ్య స‌మంత టైమ్ ఏమీ బాలేదు. నోరుజారి సినిమా గుట్టంతా విప్పేస్తోంది. అత్తారింటికి దారేది టైటిల్ ఫిక్స్ చేసింది స‌మంతే. మ‌నంలో అఖిల్ ఉన్నాడ‌ని చెప్పింది కూడా త‌నే. మ‌హేష్ బాబు సినిమా…

ఏమిటో ఈమ‌ధ్య స‌మంత టైమ్ ఏమీ బాలేదు. నోరుజారి సినిమా గుట్టంతా విప్పేస్తోంది. అత్తారింటికి దారేది టైటిల్ ఫిక్స్ చేసింది స‌మంతే. మ‌నంలో అఖిల్ ఉన్నాడ‌ని చెప్పింది కూడా త‌నే. మ‌హేష్ బాబు సినిమా 1 పోస్టర్ వివాదంలో మునిగిన క‌థానాయిక స‌మంతే. 

ఇప్పుడు తాజాగా మ‌రోసారి నోరు జారింది. టాలీవుడ్‌లో నే కాదు, కోలీవుడ్‌లోనూ క‌థానాయ‌కుల‌దే ఆధిప్యం, ఇక్కడ క‌థానాయికల‌ది రెండో స్థాన‌మే అంది. దాంతో త‌మిళ హీరోలు స‌మంత‌పై కోపంగా ఉన్నార‌ని స‌మాచార‌మ్‌. స‌మంత నోరు జార‌డం వల్ల, అక్కడ పెద్ద పెద్ద అవ‌కాశాలు ఆమెకు అంద‌కుండా పోతున్నాయ‌ట‌. తెలుగులో కూడా ఇదే ప‌రిస్థితి. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేస్తోంది. బ‌న్నీతో ఓ సినిమా ఒప్పుకొన్నట్టు స‌మాచార‌మ్‌. అగ్ర క‌థానాయ‌కులంతా స‌మంత‌తో ఆడిపాడిన వాళ్లే. కాబ‌ట్టి… స‌మంత‌ని వాళ్లంతా లైట్ తీసుకొంటున్నట్టు తెలిసింది. మొత్తానికి ఇలాంటి విచిత్రమైన స్టేట్‌మెంట్ల‌తో త‌న గొయ్యితానే త‌వ్వుకొంటోంది స‌మంత‌. ఈ వ్యవహారం స‌మంత కెరీర్‌కు ఎలాంటి ముప్పు తీసుకొస్తుందో చూడాలి.