సూర్య సినిమాలో సోనాక్షి ఐటంసాంగ్‌

బొద్దుబొద్దు అందాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మైమరపిస్తూ ఉండే సోనాక్షి సిన్హా ఇప్పుడు దక్షిణాదిలో కూడా ఓ చిత్రంలో ఐటంగాళ్‌గా మెరిసిపోబోతున్నారు. సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో సోనాక్షి సిన్హా ఐటం సాంగ్‌ చేయడం…

బొద్దుబొద్దు అందాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మైమరపిస్తూ ఉండే సోనాక్షి సిన్హా ఇప్పుడు దక్షిణాదిలో కూడా ఓ చిత్రంలో ఐటంగాళ్‌గా మెరిసిపోబోతున్నారు. సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో సోనాక్షి సిన్హా ఐటం సాంగ్‌ చేయడం ఖరారైంది. ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకుడు. సూర్య చిత్రం అంటే.. దాదాపుగా అది ఉభయభాషా చిత్రం లాగానే రూపొందుతుందని భావించవచ్చు. సూర్య ఇటీవలి అన్ని సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. ఓ మోస్తరు కలెక్షన్లతో సక్సెస్‌ అవుతున్నాయి. అంటే తెలుగు ప్రేక్షకులు కూడా సోనాక్షి అందాలను మన చిత్రంలో, అది కూడా ఐటం సాంగ్‌లో చూసి ఆనందించవచ్చునన్నమాట. 

మరో బాలీవుడ్‌ భామ దక్షిణాదిలో ఎంట్రీ ఇస్తుండడానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని మనం భావించాల్సి ఉంటుంది. నిజానికి సోనాక్షి దక్షిణాదిలోకి ఎప్పుడో రావాల్సి ఉంది. దశావతారం చిత్రంలోనే ఆమెను నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అవి వర్కవుట్‌ కాలేదు. తర్వాత తెలుగు పరిశ్రమ కూడా ఆమెకోసం ఎగబడింది. మహేష్‌బాబు సరసన నటింపజేయడానికి ప్రయత్నించారు. టాలీవుడ్‌ కనీవినీ ఎరుగనంత హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. దాంతో మహేష్‌బాబు సరసన నప్పదు అనే మిషతో ఆలోచన మానుకున్నారు. తీరా ఇన్నాళ్లకు సూర్య సరసన చేయబోతోంది. అటు తమిళులతోపాటూ తెలుగు ప్రేక్షకులను కూడా తన ఐటం సాంగ్‌తో కనులపండువగా అలరించబోతుంది.