వెంకీతో మరో మళయాళ రీమేక్‌!

తెలుగు అగ్రహీరోలో రీమేక్‌ల స్పెషలిస్టుగా విక్టరీ వెంకటేష్‌కు ఉన్నంత కీర్తి మరెవ్వరికీ లేదు. ఆయన దాదాపు చాలా భాషల నుంచి అనేక చిత్రాల రీమేక్‌లలో ఇప్పటికే నటించి ఉన్నారు. ఇటీవలి చిత్రం మసాలా కూడా…

తెలుగు అగ్రహీరోలో రీమేక్‌ల స్పెషలిస్టుగా విక్టరీ వెంకటేష్‌కు ఉన్నంత కీర్తి మరెవ్వరికీ లేదు. ఆయన దాదాపు చాలా భాషల నుంచి అనేక చిత్రాల రీమేక్‌లలో ఇప్పటికే నటించి ఉన్నారు. ఇటీవలి చిత్రం మసాలా కూడా హిందీ చిత్రానికి రీమేక్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ నటించబోయే తర్వాతి సినిమా కూడా రీమేక్‌గానే తయారవుతోంది. 

మళయాళంలో విజయవంతం అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నారు. దీనికి సంబంధించి మంతనాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో ఒకనాటి పాప్యులర్‌ కథానాయిక శ్రీప్రియ తనే దర్శకత్వం వహిస్తారు. 

ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు ఇంకా ఖరారు కావల్సి ఉంది.