ఓరి దేవుడో…. దర్శకుడెవరో?

రీమేక్‌ సినిమాలపై వెంకటేష్‌ కి మోజు తగ్గడం లేదు. అతని కెరీర్‌లో సగం సినిమాలు రీమేక్‌ కథలే. పరాయి కథలతోనే సురక్షిత ప్రయాణం అని నమ్ముతుంటాడు. ఆ బాటలోనే ప్రయాణం సాగిస్తుంటాడు. రేపు విడుదలయ్యే…

రీమేక్‌ సినిమాలపై వెంకటేష్‌ కి మోజు తగ్గడం లేదు. అతని కెరీర్‌లో సగం సినిమాలు రీమేక్‌ కథలే. పరాయి కథలతోనే సురక్షిత ప్రయాణం అని నమ్ముతుంటాడు. ఆ బాటలోనే ప్రయాణం సాగిస్తుంటాడు. రేపు విడుదలయ్యే మసాలా కూడా రీమేక్‌ కథే. ఇప్పుడు అతని నుంచి మరో రీమేక్‌ రాబోతోంది.

అదే… ఓమైగాడ్‌. అక్షయ్‌ కుమార్‌, పరేష్‌రావల్‌ నటించిన చిత్రమిది. బాలీవుడ్‌లో వంద కోట్లు సాధించింది. ఈ సినిమా రైట్స్‌ సురేష్‌ ప్రొడక్షన్స్‌ జేజిక్కించుకొని రెండేళ్లయ్యింది. పరుచూరి సోదరులు ఈ సినిమాని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చారు కూడా. అయితే దర్శకుడు మాత్రం దొరకడం లేదు. 

నిజానికి రీమేక్‌ కథ, నిర్మాత, హీరో రెడీగా ఉంటే.. దర్శకుడు దొరకడం అంత కష్టమైన పనేం కాదు.కానీ ఓమైగాడ్‌ చాలా టిపికల్‌ సబ్జెట్‌. దాన్ని డీల్‌ చేయాలంటే అనుభవజ్ఞులే కావాలి. వారి వేటలో కాలయాపన జరుగుతోంది. జయంత్‌ పేరు పరిశీలనలో ఉన్నా… అతను ఫామ్‌లో లేడు. ఒకవేళ మసాలా సినిమా హిట్‌ అయితే ఈ చిత్రాన్నీ విజయభాస్కర్‌కి అప్పగించాలని వెంకటేష్‌ భావిస్తున్నాడని సమాచారమ్‌.