చరణ్‌కి ప్రేమకథ కావాలట!

ఆరెంజ్‌లో ప్రేమ కథ ఎంచుకొని దెబ్బైపోయాడు రామ్‌చరణ్‌. మగధీర తరవాత ఎలాంటి సినిమా చేయకూడదో అలాంటి సినిమా చేసి… బాబాయ్‌ నాగబాబును నిలువునా ముంచేశాడు. “ఇక నాకు పరిపడే మాస్‌ కథలే చేస్తా..” అని…

ఆరెంజ్‌లో ప్రేమ కథ ఎంచుకొని దెబ్బైపోయాడు రామ్‌చరణ్‌. మగధీర తరవాత ఎలాంటి సినిమా చేయకూడదో అలాంటి సినిమా చేసి… బాబాయ్‌ నాగబాబును నిలువునా ముంచేశాడు. “ఇక నాకు పరిపడే మాస్‌ కథలే చేస్తా..” అని గట్టిగా శపథం పూనాడు కూడా.

అయితే ఇప్పుడు సడన్‌గా చెర్రీకి ప్రేమకథలపై దృష్టి పడింది. వరుసగా మాస్‌ సినిమాలు చేస్తే బోర్‌ కొట్టేస్తుందని.. సరదాగా రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయాలనిపించిందట. అందుకే అలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నాడు. దశరథ్‌ని అడిగింది కూడా అలాంటి కథేనట. 

అయితే ఆయన మాత్రం.. ఫ్యామిలీ స్టోరీతో వచ్చేసరికి బాబు గారికి నచ్చలేదు. ఇప్పుడు కరుణాకరన్‌కి కబురు పెట్టాడట. డార్లింగ్‌ లాంటి స్టోరీ చెప్పు.. అని అల్టిమేట్టం జారీ చేశాడట. మరి.. కరుణాకరణ్‌ డార్లింగ్‌ లాంటి కథ చెబుతాడో, లేదంటే ఎందుకంటే ప్రేమంటలాంటి కథ చెప్పి.. భయపెట్టిస్తాడో..?