ప్రభాస్ సరసన దీపికా పదుకోన్

అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంప్రదింపులు ప్రారంభమైనట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది కచ్చితంగా తన బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ప్రభాస్…

అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంప్రదింపులు ప్రారంభమైనట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది కచ్చితంగా తన బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ప్రభాస్ ఇప్పటికే ప్రకటించాడు.

మూడేళ్ల కిందటే ఓ ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, సాహో కంప్లీట్ అయిన వెంటనే బాలీవుడ్ డెబ్యూకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని గతంలో ప్రకటించాడు. ఇప్పుడీ సినిమా కోసమే దీపికాను సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ దీపిక పదుకోన్ ఒప్పుకోకపోతే.. అలియా భట్ లేదా కత్రినా కైఫ్ ను సంప్రదించబోతున్నట్టు కూడా బాలీవుడ్ మీడియా నుంచి లీకులు వస్తున్నాయి. దీనిపై స్పందించడానికి ప్రభాస్ అందుబాటులో లేడు. ప్రస్తుతం అతడు సాహో షూటింగ్ లో బిజీ.

సాహో తర్వాత సొంత బ్యానర్ లో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. సేమ్ టైం బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తానంటున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్ పైకి వస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.