ఈ మధ్య టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగింది. గత ఏడాది స్పైడర్ వందకోట్లను దాటిన సినిమా అయితే, ఈ ఏడాది ప్రారంభంలో అజ్ఞాతవాసి వచ్చింది. ఇప్పుడు మరో మూడు వంద కోట్ల సినిమాలు రానున్నాయి. అయితే ఈసారి వచ్చే సినిమాలు థియేటర్ల రైట్స్ మాత్రమే వంద కోట్ల దాటి కాదు. శాటిలైట్, ఇంతరత్రా అన్నీ కలిపి వంద కోట్లు దాటిన సినిమాలు.
రామ్ చరణ్-సుకుమార్ కాంబో రంగస్థలం, అన్నీ కలుపుకుని, 110కోట్ల వరకు మార్కెట్ చేసుకుంటోంది. ఇక మహేష్-కొరటాల శివ భరత్ అనే నేను కూడా కాస్త దానిని దాటిన రేంజ్ లో మార్కెట్ అవుతోంది.
ఇక బన్నీ-వక్కంతం వంశీ కాంబినేషన్ లోని నా పేరు సూర్య కూడా డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపి 110కోట్ల వరకు మార్కెట్ అవుతోంది. ఈ సినిమా హిందీ తెలుగు శాటిలైట్, డిజిటల్ కంటెంట్ అన్నీ కలిపి 23కోట్ల 80లక్షల వరకు అమ్ముడుపోయాయి. థియేటర్ రైట్స్ 75నుంచి 80దాకా అమ్ముడవుతున్నాయి. దాదాపు 80శాతం అమ్మకాలు పూర్తయ్యాయి.
మూడు సినిమాలు వరుసగా మార్చి, ఏప్రియల్, జూన్ ల్లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి.