టాలీవుడ్: భలే మంచి చౌక బేరము!

అమ్మో అజ్ఞాతవాసి అన్నారు. వామ్మో జైసింహా అని భయపడ్డారు. ఈ రెండు సినిమాల్ని చూసి చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. ఓ 2వారాల గ్యాప్ ఇచ్చి తమ రిలీజ్ లు పెట్టుకున్నారు నిర్మాతలు. కానీ…

అమ్మో అజ్ఞాతవాసి అన్నారు. వామ్మో జైసింహా అని భయపడ్డారు. ఈ రెండు సినిమాల్ని చూసి చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. ఓ 2వారాల గ్యాప్ ఇచ్చి తమ రిలీజ్ లు పెట్టుకున్నారు నిర్మాతలు. కానీ సంక్రాంతి సినిమాలు తుస్సుమన్నాయి. అజ్ఞాతవాసి, జైసింహా మాత్రమే కాదు, రాజ్ తరుణ్ రంగులరాట్నం కూడా ఆడట్లేదు. ఈ పండగ వీకెండ్ దాటితే ఈ 3సినిమాలకు థియేటర్లలో మనుగడ కష్టమే.

కాస్త ప్లాన్ చేసుకుంటే ఈ వీకెండ్ (జనవరి 19)కు మరో సినిమాను విడుదల చేసే స్కోప్ టాలీవుడ్ లో ఉంది. సంక్రాంతి సినిమాలకు 2వారాలు గ్యాప్ ఇద్దామనే కారణంతో చాలా సినిమాలు జనవరి 26తేదీని రిజర్వ్ చేసుకున్నాయి. దీంతో అక్కడ పోటీపెరిగింది. ఎవరైనా కాస్త ముందుగా ప్రిపేర్ అయితే ఈ వీకెండ్ కే తమ సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం థియేటర్లలో అంత ఖాళీ ఉంది మరి.

జనవరి 26కు భాగమతి, అభిమన్యుడు, ఆచారి అమెరికా యాత్ర, మనసుకు నచ్చింది లాంటి సినిమాలున్నాయి. వీటిలో కనీసం 2సినిమాలకు సరిపడా థియేటర్లు ఈ వీకెండ్ దొరుకుతాయి. ఇలా చేయడం వల్ల జనవరి 26బాక్సాఫీస్ రద్దీని తగ్గించవచ్చు. ఒక వారం ముందుగానే రిలీజ్ చేయడం వల్ల మార్కెట్ ను పెంచుకోవచ్చు.

ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ టాక్ తో నడుస్తోంది. ఇది అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల జై సింహా కొంచెం బెటర్ అనిపించుకుంది. వీటితో పాటు వచ్చిన రంగులరాట్నం సినిమా అస్సలు ఆకట్టుకోలేదు. లిమిటెడ్ రిలీజ్ కారణంగా గ్యాంగ్ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు. ఇలాంటి టైమ్ లో ఓ మంచి బొమ్మ పడితే ప్రేక్షకులు దాన్ని హిట్ చేయడం గ్యారెంటీ.