ఇలా ఎప్పటికప్పుడు సంఘమిత్ర ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈసారి స్వయంగా ఆ సినిమా దర్శడు సుందర్ సి. దీనిపై రియాక్ట్ అయ్యాడు. సంఘమిత్ర సినిమా ఆగిపోలేదని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు.
“18 నెలలుగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాం. సంఘమిత్ర ఆగిపోలేదు. సినిమాలో గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రీ-ప్రొడక్షన్ కు ఎక్కువ టైం కేటాయిస్తున్నాం. స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వగానే స్టోరీ బోర్డ్ తయారుచేస్తాం. కుదిరితే గ్రాఫిక్ వర్క్ కాస్త పూర్తయిన తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాం.” డైరక్టర్ సుందర్ వెర్షన్ ఇది.
ఈ ప్రాజెక్టులో శృతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె లండన్ లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. కానీ స్క్రిప్ట్ లో తేడాలు, కాల్షీట్ల సమస్య వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
తర్వాత ఆమె స్థానంలో దిశా పటానీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఏప్రిల్ లేదా మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో ఆర్య, జయం రవి కీలక పాత్రలు పోషిస్తారు.