ఉరిమి ఉరిమి దేని మీదో పడినట్లు వుంది వ్యవహారం. కత్తి మహేష్ ఉన్నట్లుండి తన యుద్దంలో వ్యూహం మార్చి పూనమ్ కౌర్ ను తెరపైకి తీసుకువచ్చారు. యుద్ధంలో తనకు పవన్ కు మధ్య పూనమ్ ను నిల్చోపెట్టినట్లయింది.
నిజానికి నిన్నటికి నిన్న కత్తి మహేష్ పూనమ్ పై ఆరు ప్రశ్నలు సంధించినపుడు కాస్త ఆసక్తికరమే అయ్యాయి తప్ప, అంతకు మించి హడావుడి లేదు. కానీ ఎప్పుడైతే ఈ రోజు పూనమ్ వాటికి స్పందించి, రెండు ట్వీట్ లు, ఆపై వాటిని డిలీట్ చేయడంతో, సమ్ థింగ్ ఏదో వుందన్న హడావుడి మొదలయింది.
ఇలాంటి టైమ్ లో ఇండస్ట్రీలో ఓ కొత్త విషయం సర్క్యులేట్ అవుతోంది. అందరూ ఊహాగానాలు చేస్తున్నట్లు పూనమ్ కౌర్ కు ఆంధ్ర చేనేత అంబాసిడర్ పదవి రావడానికి కారణం పవన్ కాదట.
నిజానికి పూనమ్ పవన్ ను ఒకటి రెండు సార్లు కలిసిన మాట వాస్తవమట. కానీ పవన్ మాట ఇవ్వడమే కానీ పని జరగలేదని, ఆ తరువాత పూనమ్ తాను చేనేతకార్మికుల వ్యవహారాలపై చేసిన రీసెర్చిని ఓ ఉత్తరాంధ్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు ఇండస్ట్రీ లో వినిపిస్తోంది.
దాంతో ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, అంబాసిడర్ పదవికి సిఫార్సు చేసారని వినిపిస్తోంది. అయితే ఆ మంత్రి మాట విని అంబాసిడర్ పదవి ఇచ్చేంత వుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.