సన్నీలియోన్-వీరమహాదేవి

సన్నీలియోన్ కు వున్న క్రేజ్ సంగతి కొత్తగా, డిటైల్డ్ గా చెప్పనక్కరలేదు. ఇప్పటికే తెలుగులో అయిటమ్ సాంగ్ లతో పాపులర్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో గరుడవేగ సినిమాలో సన్నీలియోన్ పాట ఎంత హిట్ అయిందో…

సన్నీలియోన్ కు వున్న క్రేజ్ సంగతి కొత్తగా, డిటైల్డ్ గా చెప్పనక్కరలేదు. ఇప్పటికే తెలుగులో అయిటమ్ సాంగ్ లతో పాపులర్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో గరుడవేగ సినిమాలో సన్నీలియోన్ పాట ఎంత హిట్ అయిందో కూడా తెలిసిందే.

అలాంటి సన్నీలియోన్ ను హీరోయిన్ గా పెట్టి, అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ మీద క్యూరియాసిటీ పెంచేలా ట్విట్టర్ లో చిన్న హడావుడి చేస్తున్నారు కూడా.

అయితే ఇంతకీ ఆ టైటిల్ ఏమిటంటే… వీరమహాదేవి. ఇప్పటికి ట్విట్టర్ లో దేవి అన్న వరకు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం అసలు పేరును తెలియజేస్తూ ఫస్ట్ లుక్ ను వదిలారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తయారయ్యే ఈ సినిమాకు తమిళ దర్శకుడు వడివుడైయన్ దర్శకత్వం వహిస్తారు.

చారిత్రాత్మక కథతో ఈ సినిమా తయారవుతుంది. ఈ సినిమాలో సన్నీ కత్తి పట్టుకుని వీరోచిత పోరాటాలు కూడా చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతోంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటుంది.