అరవింద్ కు సరైన హ్యాండ్ కరువైందా?

అల్లు అరవింద్ అంటే ఇండస్ట్రీలో కింగ్ పిన్. ప్రాజెక్టులు పట్టుకోవడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ప్లాన్ చేయడం కానీ ఆయన తరువాతే. అలాంటిది ఇప్పుడు గీతా నుంచి ప్రాజెక్టులు రాను రాను తగ్గిపోతున్నాయి.…

అల్లు అరవింద్ అంటే ఇండస్ట్రీలో కింగ్ పిన్. ప్రాజెక్టులు పట్టుకోవడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ప్లాన్ చేయడం కానీ ఆయన తరువాతే. అలాంటిది ఇప్పుడు గీతా నుంచి ప్రాజెక్టులు రాను రాను తగ్గిపోతున్నాయి. దానికి కారణం ఆయనకు సరైన హ్యాండ్స్ దొరకకపోవడమే అని టాక్ వినిపిస్తోంది. ఇలా ప్రాజెక్టులు పట్టుకోకపోవడం, ప్లాన్ చేసుకోకపోవడం అన్నది ఇప్పటికే ఈస్ట్ గోదావరిలో ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది.

విషయం ఏమిటంటే, ఈస్ట్ గోదావరిలో అనుశ్రీ ఫిలింస్ సత్యనారాయణ, గీతా అరవింద్ భాగస్వాములుగా వుంటూ వస్తున్నారు. ఇప్పుడు అనుశ్రీ సత్యనారాయణ సడెన్ గా అరవింద్ కు బై చెప్పేసి, దగ్గుబాటి సురేష్ బాబుతో చేతులు కలిపేసారని తెలుస్తోంది. దీంతో బలమైన ఈస్ట్ గోదావరి జిల్లాలో గీతాకు పట్టు లేకుండాపోయింది. దీనికి కారణం అరవింద్ కు సరైన సపోర్టింగ్ హ్యాండ్స్ లేకపోవడమే అని తెలుస్తోంది.

ఏటా అనుశ్రీ సత్యనారాయణ నేరుగా కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటున్నారు. అరవింద్ వి కొన్ని ప్రాజెక్టులు వుంటున్నాయి. కలిసి బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ రాను రారు అరవింద్ సైడ్ నుంచి ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయని,  సురేష్ తో వుంటనే బెటర్ అని సత్యనారాయణ ఫీలయి, అటు మొగ్గేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అరవింద్ అలిగి, నేరుగా ఈస్ట్ తో తమ ఆఫీసు స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. దిల్ రాజు, యువి తో కలిసి గీతా ఆఫీసును ఈస్ట్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ సమస్య ఏమిటంటే, ఈస్ట్ లో మెజారిటీ థియేటర్లు సత్యనారాయణ చేతిలోనూ, మిగిలినవి సురేష్ బాబు దగ్గర వున్నాయి. ఇప్పుడు గీతా ఆఫీసు పెట్టినా, మళ్లీ థియేటర్లకు వాళ్ల దగ్గరకే వెళ్లాలి. ఇదంతా వయసు మీద పడుతున్న అరవింద్ కు సరైన హెల్పింగ్ హ్యాండ్ కరువు కావడం వల్లనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గీతాకు కొత్త రక్తం ఎక్కించడానికి అరవింద్ ఇప్పటి నుంచి అయినా ప్రయత్నిస్తారేమో?

 రామానాయుడి వారుసుడిగా సురేష్ బాబు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ఒక కొడుకును మళ్లీ ట్రయినప్ చేస్తున్నారు. చిరంజీవి కొసం రామ్ చరణ్ కూడా నిర్మాణ రంగంలోకి వచ్చారు. కానీ అరవింద్ కొడుకు బన్నీ గీతా లో నిర్మాణం చేయకుండా ఆయన ఓన్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు. దీని వల్ల గీతాకు అరవింద్ వారసులు సారథ్యం వుంటుందా అన్నది డవుట్ గా వుంది.

ఎందుకంటే అరవింద్ కొడుకుల్లో ఇద్దరు హీరోలుగా మారిపోయారు. మరొకరు వేరే పనుల్లో వున్నారు. మెగాస్టార్ వైపు నుంచి, పవన్ వైపు నుంచి ఇప్పుడు సపోర్ట్ లేదు. కేవలం బన్నీ సినిమాలు, లేదా యువి సపోర్ట్ తో చిన్న మీడియం సినిమాలు మాత్రమే. మరి ఇప్పుడు బన్నీ కూడా వేరు కుంపటి పెట్టుకుని నిర్మాతగా మారిపోతే, అరవింద్  స్ట్రాటజీ మారుస్తారా? చేసినన్నాళ్లు చేసాం. చాలని ఊరుకుంటారా? ఏమో?