ఇంద్రగంటి మోహన కృష్ణ-సుధీర్ బాబు కాంబినేషన్లో కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఓ షెడ్యూలు పూర్తయింది. ఈ బ్యానర్ మీద ఓ టైటిల్ రిజిస్టర్ అయింది. సమ్మోహనం అన్నది టైటిల్. దాంతో ఇది సుధీర్ బాబు సినిమా కోసమే అన్న గ్యాసిప్ లు గుప్పుమన్నాయి. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, ఈ సమ్మోహనం అన్న టైటిల్ రిజిస్టర్ చేసి వుంచిన మాట వాస్తవమే కానీ అది ఇంద్రగంటి-సుధీర్ బాబు సినిమాకు కాదట.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇంద్రగంటి మోహన్ కృష్ణనే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించమన్నారు కానీ, నిర్మాతతో సహా యూనిట్ ఎవ్వరికీ ఈ టైటిల్ అంతగా నచ్చలేదని తెలుస్తోంది. అష్టాచెమ్మా, అమీతుమీ అంటే లైట్ టైటిల్స్ గా వున్నాయి కానీ, సమ్మోహనం అంటే పలకడానికే ఇబ్బందిగా వుందని, ఆడియన్స్ కు రీచ్ అవ్వడం కష్టమని అభిప్రాయపడ్డారట.
సుధీర్ బాబుతో సినిమా అంటేనే జనాలకు రీచ్ అవ్వడానికి కిందా మీదా కావాలి. అలాంటిది ఇక సమ్మోహనం లాంటి టైటిల్ అంటే మరీ కష్టం అని యూనిట్ అభిప్రాయపడిందట. పైగా ఇంద్రగంటి సినిమాలు మార్కెట్ తక్కువ, ఖర్చు ఎక్కువ వుంటాయి.
సుధీర్ బాబుతో ఇప్పుడు ఆరున్నర కోట్ల ఖర్చుతో సినిమా చేస్తున్నారు. అలాంటపుడు టైటిల్ కాస్త క్యాచీగా వుండాలి కదా? యూనిట్ జనాలు అదే చెప్పడంతో దాంతో ఆ టైటిల్ ను పక్కన పెట్టమని, మరో టైటిల్ ఆలోచిద్దామని ఇంద్రగంటి చెప్పేసారట. నిర్మాత మాత్రం ఈ టైటిల్ పెట్టే సమస్యే లేదంటున్నారు.