పవన్ కోసం బెంగుళూరు వెయిటింగ్

నీ రాక కోసం నిలువెల్ల కనులై.. అన్నట్లు వెయిట్ చేస్తున్నారు బెంగుళూరు పవర్ స్టార్ ప్యాన్స్. అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఒకటి బెంగుళూరులో వుంటుందని గతంలో ఎప్పుడో వెల్లడించాం. ఇప్పుడు ఆ ఈవెంట్…

నీ రాక కోసం నిలువెల్ల కనులై.. అన్నట్లు వెయిట్ చేస్తున్నారు బెంగుళూరు పవర్ స్టార్ ప్యాన్స్. అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఒకటి బెంగుళూరులో వుంటుందని గతంలో ఎప్పుడో వెల్లడించాం. ఇప్పుడు ఆ ఈవెంట్ కోసమే బెంగుళూరు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

తెలుగు భారీ సినిమాలకు బెంగుళూరు మార్కెట్ కూడా చెప్పుకోదగ్గ రేంజ్ కు పెరిగింది. పెద్ద సినిమా అంటే పదికోట్ల మార్కెట్ వుంది అక్కడ. అందుకే విడుదలకు ముందు అక్కడ కూడా ప్రమోషన్ ఈవెంట్ లు చేయడం అన్నది కామన్ అయింది. ఎన్టీఆర్, బన్నీ ఇప్పటికే ఇలా తమ సినిమాల కోసం బెంగుళూరు వెళ్లి ఫ్యాన్స్ ను కలిసి వచ్చారు. ఈసారి పవన్ వంతు వచ్చింది.

అజ్ఞాతవాసి విడుదల మరో రెండు వారాల్లో వుంది. ఈ లోగానే పవన్ బెంగుళూరు వెళ్లి రావాలి. అయితే అదెప్పుడు అన్నదే తెలియదు. ఈ లోగా ‘కొడుకా కోటీశ్వర్రవా’ మాస్ సాంగ్, ట్రయిలర్ వదలాలి. బెంగుళూరు వెళ్లి రావడం పవన్ కు కొత్త కాదు.

ఆయన గతంలో కొద్ది రోజుల పాటు బెంగుళూరులో ఎవరికీ తెలియకుండా వుండి, జిమ్ కు మాత్రం వెళ్లి వచ్చిన వైనాలు సోషల్ నెట్ వర్క్ లో ఫోటోలుగా వచ్చాయి. అయితే ఈసారి అఫీషియల్ గా వెళ్తారు. ఫ్యాన్స్ ను కలుస్తారు. అందుకే బెంగుళూరులో చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్న సాఫ్ట్ వేర్ పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.