సాధారణంగా కాస్త బాగా ఆడే సినిమాను వేసుకోవాలని ఎగ్జిబిటర్లు చూస్తుంటారు. హిట్ సినిమా అయితే జనాలు బాగా వస్తారు, పార్కింగ్, క్యాంటీన్ ల ఆదాయం బాగా వుంటుందని. ఒక్క సినిమా అయితే సమస్య లేదు కానీ, రెండు మూడు సినిమాలు వున్నపుడు ఏ సినిమా అయితే బెటర్ అని తమకు వున్న సోర్స్ లను ఎంక్వయిరీ చేయడం మామూలే.
ఈవారం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా ఎంసిఎ. నాగ్ నిర్మాతగా హలో. బజ్ రీత్యా హలోకి లోకల్ గా మంచి బజ్ వుంది. అయితే దిల్ రాజకు థియేటర్ల దన్ను వుంది. అయితే దిల్ రాజుకు థియేటర్లు లేని చోట్ల ఎగ్జిబిటర్లు తమ సోర్స్ లను ఎంక్వయిరీ చేయడం ప్రారంభించారని తెలుస్తోంది.
ఇలాంటి ఎంక్వయిరీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఓ బయ్యర్, కమ్, డిస్ట్రిబ్యూటర్, కమ్ ఎగ్జిబిటర్ వద్దకు వస్తే 'నా మాట వింటే ఎంసిఎ వేసుకోండి. ఎందుకు అన్నది ఇప్పుడు చెప్పను. రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది' అంటున్నారట. అదేంటీ అంటే అదంతే అంతకన్నా చెప్పకూడదు అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఓపెనింగ్స్ పరంగా హలోకే ఎక్కువ మొగ్గు వుంటుందని ఎగ్జిబిటర్లు తటపటాయిస్తున్నారని వినికిడి.
కేవలం దిల్ రాజుతో ఉన్న వ్యాపార బంధాల వల్ల అలా చెబుతున్నారా? లేక సినిమాల ఇన్ సైడ్ టాక్ ఏమైనా తెలిసి చెబుతున్నారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్ గా వుంది. ఎంసిఎ సెన్సారు అయిపోయింది. హలో సెన్సారు కావాల్సి వుంది. అందువల్ల మరి కొద్ది గంటలు ఆగితే సెన్సారు రిపోర్టు గుసగుసలు కూడా ప్రారంభం అవుతాయి.