హలో శాటిలైట్ డీల్: భలే ఛాన్స్

మొదటి సినిమా డిజాస్టర్. అయినప్పటికీ రెండో సినిమాకు మంచి శాటిలైట్ బేరం కుదిరింది. అఖిల్ నటించిన హలో సినిమాను డీసెంట్ ఎమౌంట్ కు జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. 5కోట్ల 90లక్షల రూపాయలకు తాజాగా…

మొదటి సినిమా డిజాస్టర్. అయినప్పటికీ రెండో సినిమాకు మంచి శాటిలైట్ బేరం కుదిరింది. అఖిల్ నటించిన హలో సినిమాను డీసెంట్ ఎమౌంట్ కు జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. 5కోట్ల 90లక్షల రూపాయలకు తాజాగా డీల్ పై సంతకాలు జరిగినట్టు తెలుస్తోంది.

అఖిల్ సినిమాకు ఇంత మొత్తంలో శాటిలైట్ అంటే అది చెప్పుకోదగ్గ విషయమే. అది కూడా మూవీ విడుదల కాకుండానే డీల్ సెట్ అయింది. అఖిల్ మొదటి సినిమాను కూడా ఈ ఛానెలే తీసుకుంది. కానీ ఆ డిజాస్టర్ మూవీకి టీవీల్లో కూడా రేటింగ్ రాలేదు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం.. రెండో సినిమా హలోను కూడా ఆ ఛానెల్ కు ఇచ్చాడట నాగ్.

మరోవైపు ఈ సినిమా 29కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. మూవీ బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే ఖర్చులన్నీ కలుపుకొని కనీసం 33కోట్ల రూపాయలు రావాలి. అఖిల్ సినిమాకు తెలుగులో ఇంత మొత్తం ఆశించడం కష్టం. అందుకే వసూళ్ల కోసం ఓవర్సీస్ పై ఎక్కువ దృష్టిపెట్టారు. అఖిల్ తన ప్రచారాన్ని అమెరికా నుంచి ప్రారంభించడానికి కూడా ఇదే కారణం.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అన్నీతానై నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఆఖిల్ కు చాలా కీలకం. మొదటి సినిమా డిజాస్టర్ తర్వాత హలో సినిమాను అఖిల్ కు రీలాంఛ్ గా చెబుతున్నాడు నాగ్. ఈ 'రీలాంఛ్' కూడా బెడిసికొడితే అఖిల్ కు మళ్లీ గ్యాప్ తప్పదు.