బాలయ్యతోనా? అనిల్ రావిపూడినా?

ఈ మధ్య ఓ సోషల్ మీడియా ప్రచారం షురూ అయింది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరక్షన్ లో బాలయ్య బాబు ఓ సినిమా చేయబోతున్నారని. అనిల్ రావిపూడి ఓ సినిమాను దిల్…

ఈ మధ్య ఓ సోషల్ మీడియా ప్రచారం షురూ అయింది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరక్షన్ లో బాలయ్య బాబు ఓ సినిమా చేయబోతున్నారని. అనిల్ రావిపూడి ఓ సినిమాను దిల్ రాజు కోసం చేయబోతున్న మాట వాస్తవం. అయితే అది మల్టీ స్టారర్. అందులో ఒక హీరోగా వెంకీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. మరో హీరోగా నితిన్ వుండే అవకాశం వుందని కూడా వార్తలు వినవచ్చాయి.

మరి మధ్యలో ఈ బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా ఏంటీ? దిల్ రాజు యూనిట్ వర్గాలు మాత్రం, అబ్బే, అదంతా బుస్ అని అంటున్నాయి. ఎవరో పుట్టించిన వార్త తప్ప వేరు కాదంటున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం అనిల్ రావిపూడి-బాలయ్య సినిమా అంటే ఓ రేంజ్ లో వుంటుందని హ్యాపీగా ఈ వార్తను అటు ఇటు షేర్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా వుండే అవకాశం మాత్రం చాలా అంటే చాలా తక్కువ అని తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న జై సింహా పూర్తయిన తరువాత ఏ సినిమా చేయాలన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా వుండడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయి. దానికి నిర్మాతలుగా కొత్తవాళ్లు వ్యవహరిస్తారు. ఇది కాకుండా ఎన్నికలకు దగ్గర చేసి బోయపాటి సినిమా వుంటుంది. ఈ మధ్యలో వేరే ప్రాజెక్టుల కోసం ఎవరెవరో కథలు చెబుతున్నారు, మరి ఇవి ఏదైనా ఓకే అయితే ఆ ప్రాజెక్టులు వుంటాయి. అందువల్ల మధ్యలో అనిల్ రావిపూడికి సినిమా వుంటుందా? అన్నది డవుట్.