హలో సినిమా విడుదలకు అంతా రెడీ అయింది. నిర్మాత నాగార్జున పబ్లిసిటీ విషయంలో అన్నీ తానై వ్యవహరించి, సినిమాకు మాగ్జిమమ్ బజ్ తీసుకువచ్చారు. మరో పక్క హీరో అఖిల్ అమెరికాలో డిఫరెంట్ స్టేజ్ షో లు చేస్తూ, సినిమా పట్ల అక్కడ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు. మరో వారం రోజుల్లో హలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
అయితే హలో సినిమా ఒంటరిగా రావడం లేదు. తనతో పాటు ‘రంగులరాట్నం’ ట్రయిలర్ ను తీసుకుని వస్తోంది. నాగ్ ఏం చేసినా డిఫరెంట్ నే. రంగులరాట్నం సినిమా ను నాగ్ నే నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరో. కొత్త దర్శకురాలు ఈ సినిమాకు పని చేసారు.
ఈ సినిమాను ఏమాత్రం అవకాశం వున్నా సంక్రాంతి బరిలోకి దింపాలన్నది ఆలోచన. అయితే టచ్ చేసి చూడు విడుదల వుంటే కనుక మరో డేట్ చూస్తారు. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాల మధ్య థియేటర్లు సమస్య అవుతాయి కాబట్టి. అది లేకపోతే విడుదల చేస్తారు.
అయితే ఈ రంగులరాట్నం చిన్న సినిమాకు ఇంతవరకు ప్రచారం మొదలుపెట్టలేదు. సినిమా సంక్రాంతికి రావాలంటే ఇప్పటి నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలి. ఎందుకు చేయడం లేదా అని వార్తలు వినిపించాయి. దాని వెనుక నాగ్ స్ట్రాటజీ వేరు అని ఇఫ్పుడు తెలుస్తోంది.
హలోతో పాటు రంగులరాట్నం ట్రయిలర్ ను నేరుగా థియేటర్లలోకి వదలాలన్నది నాగ్ ఆలోచన అంట. గతంలో రాజ్ తరుణ్ మొదటి సినిమా ఉయ్యాల జంపాల డిసెంబర్ ఆఖరి వారంలోనే విడుదలయ్యింది.
రంగులరాట్నం సినిమా ట్రయిలర్ ను హలోతో పాటు విడుదల చేయడం ద్వారా నాగ్ వన్ షాట్ కు టూ బర్డ్స్ ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. హలో క్రేజ్ ను రంగులరాట్నంకు కూడా వాడుకోవచ్చు. ట్రయిలర్ ను బలంగా జనాల్లోకి తీసుకెళ్లవచ్చు.