డిసెంబర్ పోటీ నుంచి తప్పుకున్న శౌర్య?

హైదరాబాద్ లో కూర్చున్నవారికి ఆంధ్ర పరిస్థితులు తెలియవు. సినిమా బాగుంది. కలెక్షన్లు ఎందుకు రావడం లేదా? అని తల పట్టుకుంటారు తప్పు, గ్రౌండ్ రియాల్టీ, జనాల పరిస్థితులు అర్థం కావు. Advertisement ముఖ్యంగా కోస్తా…

హైదరాబాద్ లో కూర్చున్నవారికి ఆంధ్ర పరిస్థితులు తెలియవు. సినిమా బాగుంది. కలెక్షన్లు ఎందుకు రావడం లేదా? అని తల పట్టుకుంటారు తప్పు, గ్రౌండ్ రియాల్టీ, జనాల పరిస్థితులు అర్థం కావు.

ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో డిసెంబర్ అంటే వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు, పండుగల షాపింగ్ లతో జనం ఎంత బిజీగా వుంటారో తెలియదు. దాంతో సినిమాలకు కలెక్షన్లు ఎందుకు రావడం లేదా? అని కిందామీదా అవుతారు. జవాన్ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఇటు బయ్యర్లో, అటు నిర్మాతనో నష్టపోక తప్పని సరి పరిస్థితి కనిపిస్తోంది.

ఇలాంటి టైమ్ లో కమెడియన్ సప్తగిరి లక్కీనే. దాదాపు సోలో డేట్ దొరికింది. ఆ తరువాత 22 నాని, అఖిల్ ఢీ కొంటున్నారు. ఎలా వుంటుందో చూడాలి. నెలాఖరున అల్లు శిరీష్, సునీల్ సినిమాలు వస్తున్నాయి. పైగా ఆ సినిమాలు వచ్చిన వారానికి అజ్ఞాతవాసి విడుదల. నిర్మొహమాటంగా థియేటర్లలోంచి సినిమాలు లేచిపోతాయి. ఎందుకంటే అజ్ఙాతవాసి క్రేజ్ ను క్యాష్ చేసుకుని, భారీ రేట్లను వెనక్కు వసూలు చేయాలంటే వీలయినన్ని ఎక్కువ థియేటర్లు వేయాలి.

ఇలాంటి టైమ్ లో మరి ఎందుకు? అనుకున్నట్లుంది హీరో నాగశౌర్య. డిసెంబర్ బరి నుంచి తప్పుకుని, ఫిబ్రవరి 2కు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒక విధంగా మంచి నిర్ణయమే. డిసెంబర్ 29 ముక్కోణపు పోటీలో వచ్చి, వారంలోగా థియేటర్లలోంచి లేపేసే బదులు, ప్రశాంతంగా ఫిబ్రవరి 2న రావడం అంటే సరైన నిర్ణయమే అనుకోవాలి.