హాయ్ ల్యాండ్ లో బాలయ్య

ఆడియో ఫంక్షన్ల కోసం డిఫరెంట్ లొకేషన్లు ఎంచుకోవడం బాలయ్య స్పెషాలిటీ. ఈసారి కూడా అదే పనిచేశాడు. తన అప్ కమింగ్ మూవీకి విజయవాడ-గంటూరు మధ్యలో ఉన్న హాయ్ లాండ్ ను వేదికగా ఎంచుకున్నాడు. అవును..…

ఆడియో ఫంక్షన్ల కోసం డిఫరెంట్ లొకేషన్లు ఎంచుకోవడం బాలయ్య స్పెషాలిటీ. ఈసారి కూడా అదే పనిచేశాడు. తన అప్ కమింగ్ మూవీకి విజయవాడ-గంటూరు మధ్యలో ఉన్న హాయ్ లాండ్ ను వేదికగా ఎంచుకున్నాడు. అవును.. జై సింహా ఆడియో రిలీజ్ హాయ్ ల్యాండ్ లో జరగనుంది. 

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఎందుకంటే కేఎస్ రవికుమార్ దర్శకుడు కాబట్టి. ఈ దర్శకుడు తీసే సినిమాల్లో మంచి కథ ఉంటుంది కాబట్టి. పైగా బాలయ్య-నయనతార కాంబో అంటే ఎవరికైనా సింహానే గుర్తొస్తుంది. అందుకే జై సింహాపై అందరి దృష్టి పడింది.

ఆడియో రిలీజ్ కు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఈనెల 23లేదా 24లో ఒక తేదీని లాక్ చేసే ఆలోచనలో ఉన్నారు. మిగిలిన 2పాటల షూటింగ్ కోసం ఎల్లుండి నుంచి దుబాయ్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ షూటింగ్ తర్వాత ఆడియో రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది.

జై సింహా సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందించాడు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి సంగీతం అందించింది ఇతడే. జనవరి 12న జై సింహా థియేటర్లలోకి వస్తున్నాడు.