అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న అజ్ఞాతవాసి సినిమా షూట్ పూర్తయిపోయింది. టోటల్ టాకీ, సాంగ్స్ అన్నీ సోమవారంతో పూర్తయిపోయాయి. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే. వివిధ ప్యాచ్ వర్క్…

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న అజ్ఞాతవాసి సినిమా షూట్ పూర్తయిపోయింది. టోటల్ టాకీ, సాంగ్స్ అన్నీ సోమవారంతో పూర్తయిపోయాయి. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే. వివిధ ప్యాచ్ వర్క్ సీన్లు, కొన్ని సింగిల్ షాట్లు అన్నీ శని, ఆది, సోమ వారాల్లో నగరంలోని పలు లొకేషన్లలో ఫినిష్ చేసేసారు. మైండ్ స్పేస్, టీవీ 5ఇలా చాలా లొకేషన్ల లో షూటింగ్ నిర్వహించారు.

హారిక హాసిని సంస్థకు గుమ్మడికాయ కొట్టే ఆచారం లేదు. అందువల్ల సింపుల్ గా షూటింగ్ క్లోజ్ అనిపించేసారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు. రేపటి నుంచి అదే పనిపై వుంటుంది యూనిట్ అంతా.

ఇంకా ఫిక్స్ కాలేదు

ఇదిలా వుంటే అజ్జాత వాసి ఆడియో ఫంక్షన్ పై సస్పెన్సు ఇంకా కొనసాగుతోంది. తెలుగు మహాసభలు హైదరాబాద్ లో రెండు వారాల పాటు ఈ నెల 5నుంచి 19 వరకు జరుగుతాయి. దీనివల్ల పోలీసులు అనేక అంక్షలు విధిస్తున్నారు. రాష్ట్రపతి రాక, ఇలాంటివి అన్నీ వున్నాయి. అందువల్ల ఇక కాస్త భారీ క్లోజ్డ్ ఆడిటోరియం మాత్రమే ఆప్షన్ గా మిగిలింది. గచ్చిబౌలి, హెచ్ ఐ సి సి వంటి పెద్ద ఇండోర్ హాల్స్ ను పరిశీలిస్తున్నారు. ఏదైనా హైదరాబాద్ లోనే నిర్వహించాలని పట్టుదలగా వున్నట్లు తెలుస్తోంది.