సైరా సినిమాకు ఇఫ్పుడు భలే సంకట స్థితి వచ్చింది. మామూలుగా అయితే ఇది పెద్ద సమస్య కాదు. కానీ రెహమాన్ ను తీసుకుందామని అనుకోవడం వల్ల వచ్చిన సమస్య అది. సైరా సినిమా ప్రారంభంలో ఏ సంగీత దర్శకుడిని తీసుకున్నా సమస్య లేదు. భలే చాన్స్ కొట్టేసాడు అనుకుంటారు. కానీ ఇప్పుడేమయింది. రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఎవర్ని తీసుకున్నా, ఇంకెవరు దొరకనట్లుంది అంటారు. తీసుకున్నవాళ్లు సరైన వాళ్లు, ముఖ్యంగా రెహమాన్ కు దీటైన వాళ్లు కావాలి. అదీ సమస్య.
రెహమాన్ కు దీటుగా సౌత్ లో ఎవ్వరూ లేరు ఒక్క కీరవాణి తప్ప. అలా అని రెహమాన్ అద్భుతమైన ట్యూన్ లు ఇచ్చేస్తాడని కాదు. సినిమాకు నేమ్ తోడు కావడం కోసం రెహమాన్ ను తీసుకున్నారు. ఇప్పుడు రీ ప్లేస్ మెంట్ అనే కీరవాణి మాత్రమే కనిపిస్తున్నారు. ఆల్రెడీ డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. కీరవాణికి మంచి పేరు వుంది. ట్యూన్లు కూడా చేయించుకోవాలి కానీ మంచివే ఇస్తారు. కానీ ఎటొచ్చీ కీరవాణి లాంటి సీనియర్ ను, కాస్త డిఫరెంట్ పర్సన్ ను సురేందర్ రెడ్డి డీల్ చేయగలరా? అన్నవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ప్రస్తుతానికి కీరవాణిని ఓ ఆప్షన్ గా మాటలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఛాయిస్ కాకపోతే, ఇంక బాలీవుడ్ జనాల కేసి చూడక తప్పదేమో?
లుక్ ఓకె
కొద్ది రోజుల క్రితం సైరా టెస్ట్ షూట్ చేసారు. దాని పట్ల ఫీడ్ బ్యాక్ బాగుంది. చిరు కూడా బాగానే హ్యాపీగా వున్నారు. ఇక రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసే ఆలోచనలో వున్నారు. బహుశా ఓ వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కావచ్చు. కానీ ఇంకా పూర్తిగా కాస్టింగ్ సెట్ కాలేదని తెలుస్తోంది. డేట్ లు, షెడ్యూళ్లు సెట్ చేసే పని నడుస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ కాస్త ఫ్రీ అయ్యారు. మరో నెల దాకా ఆయనకు రంగస్థలం పని ఏమీ లేదు. అందువల్ల ఇక సీరియస్ గా సైరా మీదే దృష్టి పెడతారని తెలుస్తోంది.