చిన్న మీడియం సినిమాలకు శాటిలైట్ అన్నది ఓ ఊపిరి. సినిమా విడుదలయిన తరువాత కన్నా, కాస్త తక్కువైనా ముందుగా అయిపోతే అదో హ్యాపీ. నాగశౌర్య హీరోగా స్వంత బ్యానర్ పై చేస్తున సినిమా ఛలో.
త్రివిక్రమ్ దగ్గర పని చేసిన వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకుడు. కన్నడ కిర్రక్ పార్టీ లో నటించిన రష్మీ మడొన్న హీరోయిన్. ఈ సినిమా టీజర్, ఓ సాంగ్ ఇటీవల విడుదలయ్యాయి. మణిశర్మ తనయుడు అందించిన ఆ ట్యూన్ కు మంచి అప్లాజ్ వచ్చింది.
ఈ రెండింటి ఫలితంగా ఛలో శాటిలైట్ కావడం సులువైంది. జెమిని టీవీ 2.50 కోట్లకు శాటిలైట్ తీసుకునేందుకు సిద్దమైంది. 9నెంబర్ లక్కీ అని ప్రతి దాంట్లోనూ చూసే నిర్మాత కమ్ నాగశౌర్య ఫాదర్ శంకర్ ప్రసాద్ మరో రెండు లక్షలు కలిపి 2.52 కి ఇచ్చేసారు. ఇప్పటికే హిందీ రైట్స్ మంచి రేటుకు అమ్మేసారు. తమిళ రీమేక్ బేరం నడుస్తోంది.
ఆంధ్రలోని చాలా ఏరియాలు ఇప్పటికే మార్కెట్ చేసిన ఈ సినిమా డిసెబర్ నెలాఖరులో విడుదలవుతుంది.