అజ్ఞాతవాసికి బీభత్సమైన ప్రచారం

130కోట్ల వ్యయం, 150కోట్ల మార్కెటింగ్.. త్రివిక్రమ్ డైరక్షన్, పవన్ హీరో, హారిక హాసిని నిర్మాణం. ఇవీ అజ్ఞాతవాసి హైలైట్స్. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు భయంకరమైన పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ సినిమాలకు జరిగే…

130కోట్ల వ్యయం, 150కోట్ల మార్కెటింగ్.. త్రివిక్రమ్ డైరక్షన్, పవన్ హీరో, హారిక హాసిని నిర్మాణం. ఇవీ అజ్ఞాతవాసి హైలైట్స్. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు భయంకరమైన పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ సినిమాలకు జరిగే రేంజ్ లో స్పాన్సర్ పబ్లిసిటీలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వినిపిస్తున్న వార్తలు వింటుంటే, అజ్ఞాతవాసి హడావుడి ఆకాశాన్నంటేలా కనిపిస్తోంది.

ఎందుకంటే స్పైస్ జెట్ తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విశాఖ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ఫ్లయిట్ లను అజ్ఞాతవాసి బ్రాండింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. 

అలాగే హైదరాబాద్ లో ఫ్రస్తుతం తిరుగుతున్న 14మెట్రో రైళ్లను బ్రాండింగ్ చేసేందకు కూడా డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ఇంక వివిధ కన్స్యూమర్ ప్రొడక్టులు కూడా అజ్ఞాతవాసి స్పెషల్ ఎడిషన్లు లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

భారీ ఆడియో

విశాఖ, అమరావతి, తిరుపతి, హైదరాబాద్ అంటూ సస్పెన్సు మెయింటెయిన్ చేస్తున్నారు ఆడియో ఫంక్షన్ వెన్యూ గురించి, 99శాతం హైదరాబాద్ లోనే వుంటుందంటున్నారు. అయితే ఎక్కడ, ఎప్పుడు అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలుతుంది. ఈ ఫంక్షన్ కు ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇస్తారో టెండర్లు దాఖలు చేయమని ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలను కోరినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాల ఆడియో ఫంక్షను మేం చేస్తాం, మేం చేస్తాం అని ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలు పోటీ పడతాయి. కోటి రూపాయిల ఖర్చయ్యే ఫంక్షన్ ను ఫ్రీగా చేస్తామని, ఎదురు మళ్లీ కొంత అడ్వర్ టైజ్ మెంట్ ఫ్రీగా ఇస్తామని వస్తారు. బేరాలు, సారాలు మామూలే.

అయితే ఈసారి ఫర్ ఏ ఛేంజ్ ఈవెంట్ సంస్థలను టెండర్లు వేయమని అడిగారని వినికిడి. అంటే ఫంక్షన్ ఫ్రీగా చేసి, ఎవరు ఎక్కువ ప్రకటనలు ఫ్రీగా ఇస్తారా అన్నదాన్ని బట్టి కేటాయిస్తారన్నమాట. అంటే ఓ కోటి రూపాయిల ప్రకటనలు ఇస్తామన్నారు అనుకోండి. సినిమాకు పబ్లిసిటీ ఫ్రీగా అయిపోయినట్లేగా. మొత్తానికి అజ్ఞాతవాసి చాలా కొత్త రికార్డులు సృష్టించేలా వుంది.