జర జాగ్రత్త.. చైతన్య?

నిజం నిష్టూరంగా వుంటుంది. నాగ చైతన్య డిజాస్టర్లు అన్నీ మాస్ లేదా యాక్షన్ సినిమాలే. ఆయనకు హిట్ లు ఇచ్చినవన్నీ లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ మూవీస్ నే. యుద్ధంశరణం అనుభవం అయిన తరువాత…

నిజం నిష్టూరంగా వుంటుంది. నాగ చైతన్య డిజాస్టర్లు అన్నీ మాస్ లేదా యాక్షన్ సినిమాలే. ఆయనకు హిట్ లు ఇచ్చినవన్నీ లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ మూవీస్ నే. యుద్ధంశరణం అనుభవం అయిన తరువాత కూడా సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ఒక చేయి మాట వినకుండా దాని పని అది చేసేయడం అన్న కాన్సెప్ట్. ఎంత ప్రేమ, ఇతరత్రా వ్యవహారాలు కూరినా, బేసిక్ గా నాగ చైతన్య ప్రమేయం లేకుండా ఓ చేయి దాని పని అది చేసేస్తుందన్నమాట.

రెండు సినిమాల అనుభవంతో చందు మొండేటి అన్నీ సమపాళ్లలో కూరి, అవసరమైతే యాక్షన్ పార్ట్ తగ్గించుకోవాల్సి వుంది. ఎందుకంటే నాగ చైతన్యనే కాదు, శర్వా, నాని, సాయిధరమ్, నితిన్ ఇలా యంగ్ బ్యాచ్ హీరోలను ఎవరినీ మాస్ యాక్షన్ సినిమాల్లో జనం ఓకె అనడం లేదు. నాని బుద్దిగా ట్రాక్ మార్చుకుని సినిమాలు చేస్తున్నారు. నితిన్ ఇటీవలే లై అంటూ మళ్లీ ఆ ట్రాక్ లోకి వెళ్లి గట్టి దెబ్బ తిన్నారు. నితిన్ కు అచ్చివచ్చినవి లవ్ స్టోరీలు, క్లాస్ సినిమాలే.

అందుకే నాగ చైతన్య ఈ సినిమా విషయంలో కాస్త జాగ్రత్తగా వుంటే చాలు. ఎందుకంటే దీని తరువాత మారుతి సినిమా ఎలాగూ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనరే. ఈ సినిమాలో మాస్ యాక్షన్ కు దూరంగా వుండి, యూత్ ఫుల్ లవ్ ఎక్కువగా వుండేలా చూసుకుంటే చాలు. హిట్ గ్యారంటీ అయిపోతుంది.

అలా కాకుండా మళ్లీ సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం మాదిరిగా యాక్షన్ మిక్స్ డ్ అంటే మాత్రం చూసుకోవాల్సి వుంటుంది. కానీ నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా వదిలిన స్టిల్ చూస్తుంటే కాస్త సీరియస్ వ్యవహారమే అనిపిస్తోంది.