డిసెంబర్ లో డేట్ల గజిబిజి

జనవరి నుంచి మే వరకు మీడియం సినిమాలు విడుదల చేయడం కష్టం అవుతుందన్న అభిప్రాయం టాలీవుడ్ లో బలంగా వుంది. దీంతో దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చిన బోలెడు సినిమాలు చకచకా డిసెంబర్…

జనవరి నుంచి మే వరకు మీడియం సినిమాలు విడుదల చేయడం కష్టం అవుతుందన్న అభిప్రాయం టాలీవుడ్ లో బలంగా వుంది. దీంతో దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చిన బోలెడు సినిమాలు చకచకా డిసెంబర్ లో డేట్ కోసం వెదుక్కుంటున్నాయి.

దీనివల్ల ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. డిసెంబర్ 1జవాన్ అన్నది పక్కా. అందువల్ల ఆ విషయంలో డవుట్ లేదు. కానీ నాని ఎంసిఎ 15న  వస్తుందా, 21అన్నది క్లారిటీగా లేదు. 21న పక్కా అని అంటున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు, ఓవర్ సీస్ జనాలకు కబురు అందిపోయిందని వినికిడి.

కానీ దీనివల్ల అఖిల్ హలోకి ఎఫెక్ట్ వుంటుంది. ఆ సినిమా 22న విడుదలవుతోంది. మరి ఈ విషయంలో నాగార్జున ఏమాత్రం నిర్మాత దిల్ రాజును కన్విన్స్ చేయగలిగితే ఎంసిఎ ఓ వారం ముందుకు వస్తుంది. అలా కాకుండా ఎంసిఎ 21కే ఫిక్సయితే సునీల్-ఎన్ శంకర్ ల టూ కంట్రీస్ సినిమా 15కు రెడీ అయిపోతుంది.

మరోపక్క డిసెంబర్ 29కోసం నాగ శౌర్య ఛలో రెడీ గా వుంది. ఇప్పటికే 23న విడుదల అంటూ డేట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్, అల్లు శిరీష్, యువి ఆనంద్ ల ఒక్కక్షణం ఓ వారం వెనక్కు వెళ్లే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఎంసిఎ 15అయితే ఒక్కక్షణం అనుకున్నట్లు 23కే వస్తుంది. అలా కాకపోతే ఓ వారం వెనక్క వెళ్లి ఛలో మీద పడుతుంది.

ఇదిలా వుంటే రవితేజ టచ్ చేసి చూడు సినిమాను కూడా ఎలాగైనా డిసెంబర్ బరిలోకి దింపాలని చూస్తున్నారు. అందుకోసం 29డేట్ ను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద నెల అంతా కలిసి ఏడెనిమిది మీడియం సినిమాలు వున్నాయి. ఇవి కాక ఆ టైమ్ కు ఇంకెన్ని రెడీ అవుతాయో?