ఇయర్ ఎండింగ్ లో ‘ఒక్క క్షణం’

హీరోగా నిలదొక్కుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు అల్లుశిరీష్. మారుతితో కొత్తజంట, పరుశురామ్ తో 'శ్రీరస్తు శుభమస్తు' మంచి పునాదే వేసాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి మాంచి…

హీరోగా నిలదొక్కుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు అల్లుశిరీష్. మారుతితో కొత్తజంట, పరుశురామ్ తో 'శ్రీరస్తు శుభమస్తు' మంచి పునాదే వేసాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి మాంచి హిట్ ఇచ్చిన ఆనంద్ దర్శకత్వంలో ఒక్కక్షణం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఒక్కక్షణం సినిమాను క్రిస్మస్ హాలీడేస్ టైమ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 22న అఖిల్ హలో సినిమా వుంది. 29న నాగశౌర్య ఛలో సినిమా వుంది. మరి ఈ రెండు డేట్ లకు మధ్యలో అల్లు శిరీష్ సినిమా వుండే అవకాశం వుంది. ఇప్పటికే శాటిలైట్ రైట్స్, కొన్ని ఏరియాల హక్కులు అమ్ముడుపోయిన ఈ సినిమా కూడా టిపికల్ స్టోరీ లైన్ తో తయారవుతోంది. ఆనంద్ ఈసారి కూడా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ను టేకప్ చేసాడు. అది వర్కవుట్ అయితే అల్లుశిరీష్ కు మరో హిట్ దొరుకుతుంది.