దాదాపు నెలరోజులకు పైగా తన పెళ్లి వ్యవహారాలతో ఫుల్ బిజీగా వుంది హీరోయిన్ సమంత. అయినా కూడా పెళ్లి తరువాత రాజుగారి గది 2 ప్రమోషన్లు మాత్రం మానలేదు. రెండు మూడు సార్లు సమావేశాలకు హాజరై, సినిమా ప్రమోషన్ కు యధాశక్తి సహకరించింది. వృత్తి పట్ల ఆ మాత్రం అంకింత భావం వుండాలి అనుకున్నారంతా.
అది అయిపోయిన తరువాత చెన్నయ్ పార్టీలు, హానీమూన్, మళ్లీ దగ్గుబాటి వారి వైపు పార్టీలు అన్నీ అయిపోయాయి. 12న అక్కినేని వారి రిసెప్షన్ ఒక్కటే వుంది. దాని వ్యవహారాలు నాగ్ చూసుకుంటున్నారు. నాగ చైతన్య తన తరువాత సినిమా షూట్ కు వెళ్లిపోయారు. ఇలాంటి టైమ్ లో సమంత నటించిన డబ్బింగ్ సినిమా అదిరింది విడుదలయింది.
ఆ సినిమాకు పబ్లిసిటీ చేద్దాం అంటే ఒక్క సెలబ్రిటీ లేరు. ఎందుకంటే హీరో విజయ్ చెన్నయ్ లో వుంటారు. నిత్యామీనన్ కేరళలో వుంటుంది. కాజల్ సంగతి సరేసరి, అందుకే యూనిట్ హైదరాబాద్ లో వున్న సమంతను అపాయింట్ మెంట్ అడిగినట్లు వినికిడి. సినిమా విడుదలకు రెండు రోజులకు ముందే సమంతను ఓ ప్రెస్ మీట్ హోల్డ్ చేయమని కోరినట్లు తెలుస్తోంది.
దానికి సమంత ఆఫీసు జనాలు అలాగే కనుక్కుని చెబుతామని చెప్పినట్లు వినికిడి. కానీ రిప్లయ్ మాత్రం రాలేదు. సినిమా విడదులయిపోయింది. సరే, లక్కీగా మంచి ఓపెనింగ్స్ నే వచ్చాయి. అదే సమంత ఓ ప్రెస్ మీట్ హొల్డ్ చేసి, కాస్త హడావుడి చేసి వుంటే అది వేరుగా వుండేది.
పెళ్లయిన బిజీలో కూడా మామ నాగ్ సినిమా కోసం అన్ని సార్లు టైమ్ స్పెండ్ చేసిన, సమంత, తను నటించిన డబ్ సినిమా కోసం కాస్తయినా టైమ్ కేటాయించకపోవడం ఏమిటో?