నా పేరు సూర్య సమ్మర్ విడుదల దిశగా చకచకా రెడీ అవుతోంది. బన్నీ ఆ తరువాత ఏ సినిమా చేస్తాడన్నది ఇప్పటికి ఇంకా ఫిక్స్ కాలేదు. లింగుస్వామి సినిమా అయితే వుండదు. మరెవరితో చేస్తాడన్నది ఫిక్స్ కాలేదు. బన్నీకి ఇప్పటికి ఇద్దరు డైరక్టర్లు లైన్లు చెప్పారని తెలుస్తోంది.
ఒకరు జైలవకుశతో హిట్ కొట్టిన బాబీ. మరొకరు ఇటీవలే మహానుభావుడుతో హిట్ కొట్టిన మారుతి. బన్నీ అయితే లైన్లు ఓకె అనేసాడు. కానీ ఎవరితో చేస్తాడు అన్నది పక్కాకాలేదు. మారుతి ప్రస్తుతం నాగచైతన్య సినిమా మీద వర్క్ చేస్తున్నారు. చైతూ నవంబర్ లో చందు మొండేటి సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత మారుతికి, కళ్యాణ్ కృష్ణ కు డేట్ లు ఇస్తాడని తెలుస్తోంది.
మరి మారుతి అంతవరకు ఆగుతారా? బన్నీతో వెళ్తారా అన్నది చూడాలి. బన్నీ కూడా మారుతితో చేసే మూడ్ లోనే వున్నట్లు తెలుస్తోంది. బాబీ కూడా ఇద్దరు హీరోలతో ఆప్షన్ పెట్టుకుని వున్నారు. ఇటు నాని, అటు బన్నీ ఇద్దరి వైపూ చూస్తున్నారు. మరి ఎవరితో ఫిక్స్ అవుతుందో?