హీరో బాలకృష్ణ యంగ్ హీరోలకన్నా ఫాస్ట్ గా వున్నారు. ఇలా సినిమా చేసి అలా విడుదలకు రెడీ చేస్తున్నారు. 2017లో రెండు సినిమాలు అందించారు. 2018 సంక్రాంతికి మళ్లీ మరోటి రెడీచేస్తున్నారు. కెఎస్ రవికుమార్ డైరక్షన్ లో నిర్మాత సి కళ్యాణ్ అందిస్తున్న సినిమా జై సింహా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నవంబర్ 1న విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకు రెడీ చేస్తున్నారు.
బాలయ్య ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లలో కనిపించేది ఈ సినిమాలో నయనతార ది కీలకపాత్ర. హైదరాబాద్ తో పాటు తమిళనాడులో కీలక షెడ్యూళ్లు పూర్తి చేసుకుందీ సినిమా. నవంబర్ నెలాఖరుకు దాదాపు టాకీ పూర్తయిపోతుంది. ఒకటి రెండు పాటల చిత్రీకరణ వుంటుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్.
ఈ సినిమా పూర్తయిన తరువాత కాస్త గ్యాప్ తీసుకుని, బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టి పెడతారు. ఈలోగా మరో సబ్జెక్ట్ ను ఫైనల్ చేసేపనిలో వున్నట్లు తెలుస్తోంది. బోయపాటితో ఓ సినిమా బాకీ వుంది. బహుశా ఆ ప్రాజెక్టు అదే కావచ్చు.