టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత ఎంతయినా వుంది. పైగా యంగ్ హీరోలతో మీడియం బడ్జెట్ సినిమాలు తీస్తున్నపుడు కొత్త హీరోయిన్ లు అయితే కాస్ట్ కటింగ్ కు కలిసి వస్తుంది. ఇవన్నీ ఆలోచించే కావచ్చు, నిఖిల్ తో ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించే కిర్రాక్ పార్టీ తెలుగు వెర్షన్ కోసం సిమ్రాన్ పరీంజా అనే కొత్త నటిని తీసుకున్నారు.
ఈమె ఉత్తరాదిన టీవీ సిరీస్ లు, టీవీ షోల్లో నటించే అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని టీవీ తెర మీద నుంచి సినిమా తెరపైకి తెస్తున్నారు ఎకె ఎంటర్ టైన్ మెంట్స్. కిర్రాక్ పార్టీకి బడ్జెట్ కాస్త బాగానే అవుతోందని వినికిడి. దర్శకులు చందు మొండేటి మాటలు రాస్తున్నారు. మరో దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే ఇచ్చి, పర్యవేక్షిస్తున్నారు. చందు మొండేటి శిష్యుడు శరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏడెనిమిది కోట్ల రేంజ్ వరకు అయితే నిఖిల్ సినిమా ఓకె. ఎందుకంటే పదికోట్ల మేరకు నిఖిల్ మార్కెట్ వుంది.
కిర్రాక్ పార్టీ కన్నడంలో పెద్ద హిట్ కాబట్టి, కాస్త మంచి రేటుకే రైట్స్ కొనాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు మీడియం రేంజ్ హీరోయిన్ ను తేవాలన్నా కనీసం యాభై లక్షలు ఖర్చు చేయాలి. కేశవ సినిమా కోసం రీతూవర్మను తెచ్చినపుడు అదే విధంగా కిందామీదా అవ్వాల్సి వచ్చింది. నిఖిల్ సూర్య వెర్సస్ సూర్య కోసం కూడా బెంగాలీ నుంచి చిన్న నటి తీర్థ చౌదరిని తీసుకువచ్చారు.