పింగళిగా బుర్రా సాయి మాధవ్

మహానటి సినిమాలో గెస్ట్ ఆర్టిస్టుల సంఖ్య రాను రాను పెరుగుతోంది.  నటి సావిత్రి జీవిత చరిత్ర కావడంతో పాత్రల సంఖ్యకు కొదవలేదు. వేయాలంటే సవాలక్ష పాత్రలు. అప్పటి హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇంకా.. ఇంకా.…

మహానటి సినిమాలో గెస్ట్ ఆర్టిస్టుల సంఖ్య రాను రాను పెరుగుతోంది.  నటి సావిత్రి జీవిత చరిత్ర కావడంతో పాత్రల సంఖ్యకు కొదవలేదు. వేయాలంటే సవాలక్ష పాత్రలు. అప్పటి హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇంకా.. ఇంకా. అందువల్ల బయోపిక్ కు అల్లుకున్న కథ ప్రకారం బోలెడు పాత్రలు వుండనే వున్నాయి. ఒకటి రెండింటికి తప్ప మిగిలిన వాటికి రెమ్యూనిరేషన్ కూడా అక్కరలేదు. ఎందుకంటే అన్నీ హానరరీ పాత్రలే. పైగా ఇలాంటా పాత్రలు తమకు ఇవ్వడం కూడా ఓ గౌరవంగా భావిస్తారు అంతా.

అన్నింటికి మించి వట్టి బయోపిక్ అంటే ఎవరుచూస్తారు? అదే కనుక పేరు ప్రఖ్యాతులన్న ఇంత మంది వున్నారు అన్న ప్రచారం వస్తే, జనాల్లో సినిమాకు ఓ బజ్ వస్తుంది. పైగా మాయాబజార్ ఏపిసోడ్ రీ ప్రొడ్యూస్ చేసారు అంటే, జనంలో అదో ఆసక్తి కలుగుతుంది. అందువల్ల ఈ ఎపిసోడ్ ను ప్రత్యేకంగా జోడించారు. దానికే కాస్త ఖర్చు చేస్తున్నారు.

ఈ ఎపిసోడ్ లో కెవి రెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్ కనిపిస్తున్నారని ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. కానీ మాయాబజార్ సృష్టికర్త, రచయిత పింగళి వుండనే వున్నారు. ఆ పాత్రను రచయిత బుర్రా సాయిమాధవ్ పోషిస్తున్నారట. రచయితలుగా రచయితలు, నటులుగా నటులు, డైరక్టర్లుగా డైరక్టర్లు అన్నమాట. 

వీళ్లంతా సరే, అసలు ఎన్టీఆర్-ఎఎన్నార్ ల సంగతేమిటి? అవే కదా అసలు సిసలు పాత్రలు.