శృతిహాసన్ తప్పుకోవడంతో సంఘమిత్ర ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కాస్త ఆలస్యమైంది. తాజాగా ఆమె స్థానంలో దిశా పటానీని తీసుకున్నారు. ఆ విషయాన్ని నిన్న అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు కూడా. మరోవైపు ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్టయ్యాయి.
దర్శకుడు సి.సుందర్, మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీత చర్చలు జరుపుతున్నారు. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి సెట్స్ పైకి వచ్చిన మొదటిరోజు నుంచే ప్రచారం షురూ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెహ్మాన్ తో 2-3 రకాల థీమ్స్ కంపోజ్ చేయించాలని నిర్ణయించారు. రెహ్మాన్ కంపోజ్ చేసిన ఆ థీమ్ మ్యూజిక్ ను ముందుగానే విడుదల చేసి మూవీపై హైప్ తీసుకురావాలనేది ప్లాన్.
సంఘమిత్ర ప్రాజెక్ట్ ను కేన్స్ చిత్రోత్సవంలో లాంచ్ చేసినప్పుడు ఆర్య, జయం రవి, శృతిహాసన్ ఫొటోలను ఉపయోగించి గ్రాఫిక్స్ చేశారు. శృతిహాసన్ తప్పుకోవడంతో దిశాపటానీతో మళ్లీ గ్రాఫిక్స్ చేయించి, దానికి రెహ్మాన్ థీమ్ మ్యూజిక్ ను జోడించబోతున్నారు. ఓ మంచిరోజు చూసి, సినిమా సెట్స్ పైకి వెళ్లే టైమ్ లో ఆ వీడియోను విడుదల చేస్తారు.
సంఘమిత్ర ఆలస్యమౌతుందనే ఉద్దేశంతో సి.సుందర్ మరో ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. గతంలో తను తీసిన హిట్ సినిమాకు సీక్వెల్ గా మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు. ఈ నెలాఖరు నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే సంఘమిత్ర సెట్స్ పైకొస్తుంది.