ఔనా? నిజమేనా బండ్లా?

రెండేళ్ల గ్యాప్ తరువాత నిర్మాతగా బండ్ల గణేష్ మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. తాను తోలి సారిగా నిర్మించిన ఆంజనేయులు చిత్ర హీరో రవితేజ తోనే బండ్ల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే…

రెండేళ్ల గ్యాప్ తరువాత నిర్మాతగా బండ్ల గణేష్ మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. తాను తోలి సారిగా నిర్మించిన ఆంజనేయులు చిత్ర హీరో రవితేజ తోనే బండ్ల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.

అయితే ఇంకా ఏ విషయమూ అయితే కన్ ఫర్మ్ కాలేదు. రవితేజ నిర్మాత బండ్ల గణేష్ పట్ల కాస్త సానుకూల ధోరణితోనే వున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం రవితేజ ఓ సినిమా ఫినిష్ అయింది. మరో సినిమా షూట్లో వుంది. అది డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. జనవరి నుంచి మరో సినిమా స్టార్ట్ చేయాలి. శ్రీను వైట్లకు లైన్ ఓకే చేసాడు. కానీ నిర్మాతగా మైత్రీ మూవీస్ పక్కా అవుతుందా? కాదా? అన్నది డవుట్.

ఒకవేళ మైత్రీ పక్కకు తప్పకుంటే ఆ చాన్స్ బండ్ల గణేష్ కు వస్తుందని తెలుస్తోంది. అలా కాకుండా మైత్రీ కనుక ముందుకు వస్తే, దాని తరువాత సినిమా బండ్లకు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. మొత్తం మీద బండ్ల గణేష్ కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్లు కనిపిస్తున్నాయి.