రంగస్థలం కోసం కత్తిలాంటి ఐటెంసాంగ్

సుకుమార్-దేవిశ్రీప్రసాద్.. ఐటెంసాంగ్స్ విషయంలో ఈ కాంబినేషన్ సూపర్ హిట్. ఇప్పటివరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఏ ఐటెంసాంగ్ ఫెయిల్ అవ్వలేదు. రంగస్థలం కోసం కూడా అలాంటిదే ఓ కత్తిలాంటి ఐటెంసాంగ్ రెడీ అయింది.…

సుకుమార్-దేవిశ్రీప్రసాద్.. ఐటెంసాంగ్స్ విషయంలో ఈ కాంబినేషన్ సూపర్ హిట్. ఇప్పటివరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఏ ఐటెంసాంగ్ ఫెయిల్ అవ్వలేదు. రంగస్థలం కోసం కూడా అలాంటిదే ఓ కత్తిలాంటి ఐటెంసాంగ్ రెడీ అయింది. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. ఈ సాంగ్ కోసం 2 ట్యూన్స్ ఫైనల్ చేశారు. వాటిలోంచి ఒకటి ఫిక్స్ చేయడమే ఆలస్యం. 

ఐటెంసాంగ్ ఎంపిక విషయంలో సుకుమార్-దేవిశ్రీదే అంతిమ నిర్ణయం. ఈ విషయంలో వీళ్లిద్దరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది మెగా కాంపౌండ్. సో.. ఇద్దరూ కూర్చొని చర్చించుకొని ఓ ట్యూన్ ఫిక్స్ చేయడమే ఆలస్యం. ఈ పాట కోసం డీజే బ్యూటీ పూజా హెగ్డేను ఇప్పటికే సెలక్ట్ చేసిన విషయం తెలిసిందే. 

తన ప్రతి ఐటెంసాంగ్ లో క్యాచీ పదాలు ఉపయోగిస్తాడు దేవిశ్రీ ప్రసాద్. కెవ్వు కేక, కత్తి, పక్కా లోకల్ లాంటి పదాలు అలా పుట్టుకొచ్చినవే. సో.. రంగస్థలం కోసం ఎలాంటి పదాలు పుట్టిస్తాడనేది ఇంట్రెస్టింగ్ మారింది. ఎందుకంటే ఇది 1985నాటి కథతో తెరకెక్కుతున్న సినిమా. ఏవైనా పదాలు వాడితే సెల్ ఫోన్లు కూడా లేని అప్పటి కాలానికి తగ్గట్టుగానే వాడాలి మరి.